Earthquake In Japan: భూకంపం అనేది ఆకస్మికంగా జరిగే సంఘటన. ప్రతిస్పందించడానికి సమయం ఇవ్వదు. భూకంపాలను అంచనా వేయడం కూడా కష్టం. భూకంపం సంభవించిందంటే నష్టం తీవ్రంగా ఉంటుంది. ఇక ప్రపంచంలో అనేక దేశాల్లో భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇలాంటి దేశాల్లో జపాన్ ఒకటి. తాజాగా జపాన్‌లోని భూకంపం సభవించింది. ఈ ఏడాది సంభవించిన ఘోరమైన భూకంపం నుంచి కోలుకోకముందే జపాన్ ఉత్తర–మధ్య ప్రాంతమైన నోటోలో మంగళవారం(నవంబర్ 26న) అర్ధాత్రి బలమైన భూకంపం సంభవించింది. అయితే సునామీ హెచ్చరికలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
నోటో ద్వీపంలో..
జపాన్‌లోని నోటో ద్వీపకల్పంలోని పశ్చిమ తీరంలో 10.కి.మీ లోతులో 6.4 తీవ్రతతో భూకంపం సంబవించిననట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. సునామీ ప్రమాదం లేదని పేర్కొంది. యూఎస్‌జీఎస్ తీవ్రతను 6.1గా వెల్లడించింది. జపాన్‌లో భూకంపం రిక్టర్ స్టేల్‌పై 5.8 తీవ్రతతో జపనీస్ ద్వీపాన్ని తాకింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.
జనవరిలో భారీ భూకంపం..
జపాన్‌లో గత జనవరి 1న నోటో ప్రాంతంలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సభవించింది. ఈ ఘటనలో 370 మందికిపైగా మరణించారు. రోడ్లు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నది. ఇప్పుడిప్పుడే నాటి భూకంపం నుంచి కోలుకుంటోంది. ఆ గాయం ఇంకా మానలేదు. మళ్లీ మంగళవారం 6.4 తీవ్రతతో తాజాగా నోటో ద్వీపంలోనే భూకంపం సంభవించింది. నోటో ఉత్తర భాగంలో అణు విద్యుత్ ప్లాంట్‌కు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. షికా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోని రెండు రియాక్టర్లకు స్వల్ప నష్టం కలిగినట్లు తెలిసింది. అయితే రేడియేషన్ లీక్ కాలేదని అధికారులు తెలిపారు.