Malayalam industry : మలయాళ సినిమాలు చూసే అలవాటు మీకు ఉందా? ఆ సినిమాలను చాలా మంది మాయలు సినిమాలు అంటున్నారు. ఆ ఇండస్ట్రీలో వస్తున్నంత డిఫెరెంట్ కథలు ఎక్కడా రావట్లేదుఅనే చెప్పాలి. వారి పెన్ కు ఏదో డిఫరెంట్ స్టైల్ ఉన్నట్టు ఉంది. అందుకే కావచ్చు కథలు కూడా అద్భుతంగా కొత్తగా వస్తున్నాయి. చిన్న పాయింట్స్ పట్టుకుని సినిమాలు చేస్తూ అదరగొడుతున్నారు. కుక్కపిల్ల, సబ్బుబిల్ల అగ్గిపుల్ల కవితకు కాదేది అనర్హం అన్నట్టు.. ఇగోలు, గురకలు, పార్కింగ్‌లు ఇలా కథకు ఏదీ కాదు అనర్హం అనే రేంజ్ లో వారి సినిమాలు సాగుతున్నాయి. అందుకే మలయాళ ఇండస్ట్రీకి మాయల ఇండస్ట్రీ అంటూ తెగ పొగిడేస్తున్నారు.
ఈ ఇండస్ట్రీని చూసి చాలా మంది కుళ్లు కుంటున్నారట కూడా. పైకి చెప్పట్లేదు కానీ అలా ఎలా తీస్తున్నార్రా సామీ అంటున్నారట కొందరు. అందుకే ఇప్పుడు ఈ ఇండస్ట్రీ టాప్ ఫామ్‌లో ఉంది. ఈ సంవత్సరం మొదటి 5 నెలల్లోనే రూ.1000 కోట్లు వసూలు చేసింది ఈ ఇండస్ట్రీ. ఇండియాలో ఏ ఇండస్ట్రీకి సాధ్యం కాలేదట ఈ రికార్డు. తెలుగులో గుంటూరు కారం, హనుమాన్, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలన్నీ కలిపి రూ.600 కోట్లకు పై చిలుకు మత్రము వస్తే.. తమిళంలో 2024లో రిలీజైన అన్ని సినిమాలు కలిపితే కనీసం 400 కోట్ల మార్క్ కూడా రాలేదు.
బాలీవుడ్ లో సైతాన్, ఫైటర్, క్య్రూ లాంటి సినిమాలు కలిపి రూ.950 కోట్ల వరకు మాత్రమే వసూలు చేసాయి. ఇదెలా ఉంటే అటు కన్నడ ఇండస్ట్రీ కూడా 300 కోట్ల లోపే కలెక్ట్ చేసింది. అయితే సెకండాఫ్‌లో టాలీవుడ్ జూలు విదిల్చిన విషయం తెలిసిందే. కల్కి, దేవర సినిమాలే దాదాపు 1600 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. కానీ మలయాళ ఇండస్ట్రీ మాత్రం వేరే లెవల్ అని చెప్పాలి. ఎందుకంటే తొలి 5 నెలల్లోనే మంజుమ్మల్ బాయ్స్ 250 కోట్లు.. ఫహాద్ ఫాజిల్ ఆవేశం 150 కోట్లు..ప్రేమలు 140 కోట్లు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడుజీవితం 175 కోట్లు.. మమ్ముట్టి భ్రమయుగం 75 కోట్లు.. టొవీనో థామస్ అన్వేషిప్పన్ కొండెతుమ్ 50 కోట్లను వసూలు చేసి టాప్ లో ఉన్నాయి. అంటే ఈ సంవత్సరంలో ఈ సినిమాల కలెక్షన్స్ అన్నీ కలిపితే 1000 కోట్లు దాటిందన్నమాట.
ఈ మధ్య థ్రిల్లర్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిపోతుంది ఈ సినిమా. పదేళ్ళ కింద దృశ్యంతో మొదలైన ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత చాలా సినిమాలు ఇదే కోవలో కి వచ్చాయి. ఈ మధ్యే కిష్కింద కాండం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో విడుదల కాలేదు. అయినా సరే కానీ హైదరాబాద్ జనాలు ఎగబడి మరీ ఈ సినిమాను చూసారు. తాజాగా సూక్ష్మదర్శిని అనే సినిమాను సైతం ఓటిటిలో అదే రేంజ్ లో ఆదరిస్తున్నారు. అంటే సుందరానికిలో హీరోయిన్‌గా నటించిన నజ్రియా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించింది.
పక్కింట్లో ఉన్న బామ్మ హఠాత్తుగా మాయం అవడం, ఆమె కొడుకు మాన్యుయెల్‌పై డిటెక్టివ్ అయిన నజ్రియా అనుమాన పడటం, అక్కడ్నుంచి కథ మలుపు తిరగడం ఇలా సినిమా ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్ ను కలిగిస్తుంది. చిన్న లైన్స్ తీసుకుని అద్భుతాలు చేస్తున్నారు ఈ ఇండస్ట్రీ మేకర్స్. కోటి రూపాయల బడ్జెట్‌తో సినిమాలు చేసి.. 50 కోట్లు, 100 కోట్లు వసూలు చేయడం చిన్న విషయం కాదు.