Collar Ey Etthara Song Review: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(UstaadBhagatSingh చిత్రం మరో వారం రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా వదులుతున్నారు. రీసెంట్ గానే ‘ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా’ పాటకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్ నుండి భిన్నమైన రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది మాస్ బీట్ అదిరింది అంటూ కామెంట్ చేయగా, మరికొంత మంది మాత్రం పాత కమర్షియల్ సినిమాల్లోని పాట లాగా ఉందంటూ కామెంట్స్ చేశారు. అయితే కాసేపటి క్రితమే పూర్తి పాటను విడుదల చేశారు మేకర్స్. హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో అభిమానుల సమక్షం లో ఈ పాటని విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఇక పాట విషయానికి వస్తే, ఇది సోషల్ మీడియాలో లీకై చాలా రోజులే అయ్యింది. లీక్ అయినప్పుడు ఈ పాటని విన్న అభిమానులు, ట్యూన్ బాగానే ఉంది కానీ, దేవి శ్రీప్రసాద్ గాత్రం ఈ పాటకు సెట్ అవ్వలేదని కొందరు, మ్యూజిక్ కూడా చాలా రొటీన్ గా ఉందని మరికొందరు కామెంట్స్ చేశారు. అయితే అది కేవలం షూటింగ్ కోసం ఉపయోగించిన సాంగ్ మాత్రమే అని, మెయిన్ సాంగ్ వేరే సింగర్ తో పాడిస్తారని అనుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే ఈ పాటను రామ్ మిర్యాల తో పాడించారు. ఆయన గాత్రం ఈ పాటకు సూట్ అయ్యింది, పవన్ కళ్యాణ్ స్టెప్పులు కూడా బాగున్నాయి. ఇక రాశీ ఖన్నా ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్ గా నిల్చింది. థియేటర్ లో ఈ పాట వచ్చినప్పుడు అభిమానులు సీట్స్ లో కూర్చోరు అనే విషయం స్పష్టంగా అర్హం అవుతోంది.
అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మీద ఇంకా కొంచెం శ్రద్ద చూపించి ఉండుంటే బాగుండేది అనిపించింది. మన చిన్నతనం లో విన్న పాటలివి. ఇప్పటికీ అదే తరహా మ్యూజిక్ ఇస్తానంటే ఎలా చెప్పండి. పవన్ కళ్యాణ్ , దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో గతంలో జల్సా, గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలు వచ్చాయి. మ్యూజికల్ గా ఈ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా అంటే ఎలా ఉండాలి చెప్పండి ?, ఆ రేంజ్ లో మాత్రం లేదని అభిమానులు అంటున్నారు. కాకపోతే ఇప్పటి వరకు విడుదల చేసిన పాటల్లో ఇది ది బెస్ట్ గా ఉందని అంటున్నారు. మరి సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారిన ఈ పాటని మీరు కూడా చూసేయండి.
