Homeఅంతర్జాతీయంDonald Trump: హౌతీలపై అమెరికా దాడులు.. వీడియో విడుదల చేసిన ట్రంప్‌

Donald Trump: హౌతీలపై అమెరికా దాడులు.. వీడియో విడుదల చేసిన ట్రంప్‌

Donald Trump: సముద్ర మార్గంలో వచ్చే షిప్‌లపై దాడిచేస్తూ అందులోని సొత్తును దోచుకెళ్తున్నారు యెమెన్‌(Yemen)లోని హౌతీలు. ఇందులో ప్రధానంగా అమెరికా(America) షిప్‌లపైనే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. దీంతో అగ్రరాజ్యాధినేత ట్రంప్‌(Trump)హౌతీల నియంత్రణకు చర్యలు చేపట్టారు. తాజాగా సంచనల వీడియో విడుదల చేశారు.

Also Read: ట్రంప్‌ సుంకాల యుద్ధం.. అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం!

యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా ఇటీవల భీకర వైమానిక దాడులు(Airforce war) చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు సంబంధించిన డ్రోన్‌ దృశ్యాలను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా సామాజిక మాధ్యమాల్లో(Social Media) పంచుకున్నారు. హూతీలు నౌకలపై దాడులు చేసేందుకు సమావేశమైన సమయంలో తాము చర్యలు తీసుకున్నామని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. వీడియోలో ఒక సమూహంపై జరిగిన దాడి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడుల్లో 50 మందికి పైగా మరణించగా, అనేకమంది గాయపడ్డారు.

ఇజ్రాయెల్‌ నౌకలపై దాడులు..
ఇటీవల ఇజ్రాయెల్‌(Izroyel) నౌకలపై దాడులను పునఃప్రారంభిస్తామని హౌతీలు ప్రకటించారు. దీంతో ట్రంప్‌ మార్చి 15న బలమైన సంకేతాలు పంపాలని ఆదేశించారు. దీంతో అమెరికా దళాలు యెమెన్‌లో భారీ దాడులకు దిగాయి. ఈ చర్యల ద్వారా జలమార్గాల్లో అమెరికా నౌకల స్వేచ్ఛను ఏ ఉగ్రశక్తీ అడ్డుకోలేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. అంతేకాదు, హూతీలకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని ఇరాన్‌ను హెచ్చరించారు. అయితే, ఇరాన్‌ సుప్రీంలీడర్‌(Iran Supream Leader) ఖమేనీ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. హౌతీల దాడుల్లో తమ ప్రమేయం లేదని, వారు స్వతంత్రంగా చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. అమెరికా తమపై నిందలు వేస్తే తగిన ఫలితం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

యుద్ధ నేరంగా..
ఇదిలా ఉంటే హౌతీల పొలిటికల్‌ బ్యూరో ఈ దాడులను యుద్ధ నేరంగా అభివర్ణించి, ప్రతిస్పందనకు సిద్ధమని తెలిపింది. ఈ ఘటనలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. అమెరికా చర్యలు హౌతీలను అణచివేసేందుకా లేక ప్రాంతీయ ఘర్షణలను తీవ్రతరం చేసేందుకా అనే చర్చ జోరందుకుంది. ట్రంప్‌ వీడియో షేర్‌ చేయడం ద్వారా తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, దీనిపై అంతర్జాతీయ సమాజం నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఈ దాడులు శాంతి స్థాపనకు దోహదపడతాయా లేక మరింత అస్థిరతకు దారితీస్తాయా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version