Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో జరుగనున్నాయి. ఈమేరకు ఆదేశ ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఓటరు నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. గ్రీన్‌కార్డు పొందిన భారతీయులు ఓటుహక్కు నమోదు చేసుకునేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. అధికార డెమోక్రటిక్ పార్టీ కూడా భారతీయులు ఓటుహక్కు నమోదు చేసుకునేలా కృషి చేస్తోంది. ఇక అభ్యర్థుల ప్రచారం కూడా ఊపందుకుంది. ప్రధాన పార్టీలైన అధికార డెమోక్రటిక్ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులుగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ ఉంది. ఇక ఈ ఎన్నికల్లో మొదట అధికార పార్టీ అభ్యర్థిగా జోబైడెన్ ఉండగా, ఆయన అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఉపాధ్యక్షురాలు, భారతీయ, ఆఫ్రికన్ మూలాలున్న కమలా హారిస్ రేసులోకి వచ్చారు. బైడెన్ అభ్యర్థిగా ఉన్న సమయంలో డెమోక్రటిక్ పార్టీ గెలుపు అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలో ట్రంప్‌పై కాల్పులు జరగడం కూడా అమెరికన్లను ఆయనవైపు మళ్లించింది. ట్రంప్‌వైపే మెజారిటీ అమెరికన్లు మొగ్గు చూపారు. ఇప్పుడు కమలా బరిలో నిలవడంతో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. క్రమంగా కమలా రేసులో దూసుకుపోతోంది. తాజాగా నిర్వహించిన సర్వేల్లో ట్రంప్ కన్నా కమలా ముందు ఉన్నట్లు పలు సంస్థలు తెలిపాయి.
వ్యక్తిగత విమర్శలు..
ఎన్నికల రేసులో వెనుకబడుతున్న ట్రంప్ ప్రచారంలో వ్యక్తగిత విమర్శలు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కమలా కన్నా తానే అందంగా ఉంటానని వ్యక్తిత్వాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారు. దీనికి కమలా కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చింది. భయం ఉన్నవారు అలాగే మాట్లాడతారని పేర్కొన్నారు. ఇక తాజాగా డొనాల్డ్ ట్రంప్ తనపై హత్యాయత్నం జరిగిన అనంతరం తొలిసారి బహిరంగ సభలో బుల్లెట్ ప్రూఫ్ రక్షణ గ్లాస్ వెనక నుంచి మాట్లాడారు. నార్త్ కరోలినా ఎన్నికల ర్యాలీలో పాల్గొన ట్రంప్ మరోసారి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై విమర్శలు గుప్పించారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కమల గెలుస్తే.. మూడో ప్రపంచ యుద్ధం రావటం ఖాయమన్నారు. ‘మీ(ప్రజలు) జీవితకాలపు పొదుపు చేసుకున్న డబ్బు మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. కమల అత్యంత ర్యాడికల్ భావాలు కలిగి ఉన్న వ్యక్తి. ఆమె గెలిస్తే.. అమెరికాలో మిలియన్ల ఉద్యోగాలు రాత్రికిరాత్రే ఊడిపోతాయి. నేను మీకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాను చిన్నచూపు చూడన్విలేదు. ఆ విషయం మిగతా ప్రపంచదేశాధి నేతలకు కూడా తెలుసు. వచ్చే ఎన్నికల్లో కామ్రేడ్ కమల గెలిస్తే మాత్రం.. మూడో ప్రపంచ యుద్ధం జరగట ఖాయం’అని అన్నారు.
ప్రచారంలో పాల్గొన్నవారికి చికిత్స..
అదేవిధంగా ర్యాలీలో ఒక్కసారి ట్రంప్ ప్రసంగం ఆపేసి డాక్టర్ను పిలిచారు. ర్యాలిలో పాల్గొన్న ఒకరు నీరంగా ఉండటం గమనించి ట్రంప్ వైద్యం సాయం అందించాలని అన్నారు. ‘ఇక్కడ చాలా వేడిగా ఉంది. నేను గమనించాను. చాలా మంది ప్రజలు ఇక్కడికి రావడానికి రోజుల తరబడి వేచి ఉన్నారు. కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. డాక్టర్ వారికి వైద్యసాయం అందించండి’ అని సూచించారు. ఇలా ట్రంప్ తన మైలేజీ పెంచుకునేందుకు వ్యక్గిత విమర్శలు చేయడమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అదే ఆయన ప్రజల్లో ఆదరణ కోల్పోవడానికి కారణమవుతుందని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు.