Chiranjeevi And Mahesh: చిరంజీవి – మహేష్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమాలు ఇన్ని ఉన్నాయా..? చేసుంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేది!

టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి సమకాలీన హీరోలు కూడా కలిసి సినిమాలు చేసేస్తున్న రోజులివి. అయితే కొన్నేళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వం లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో టీ సుబ్బిరామిరెడ్డి నిర్మాతగా ఒక సినిమాని ప్రకటించారు.

Written By: Vicky, Updated On : August 22, 2024 3:48 pm

Chiranjeevi And Mahesh

Follow us on

Chiranjeevi And Mahesh: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా నెంబర్ 1 హీరో గా కొనసాగి ఇప్పటికీ కూడా నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడుతూ తన సత్తా చాటుతున్న చిరంజీవి పుట్టినరోజు వేడుకలను నేడు ఆయన అభిమానులు ఏ స్థాయిలో జరుపుకుంటున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గురించి అభిమానులకు తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము. చిరంజీవి తన కెరీర్ ప్రారంభం లో ఎంతో మంది సూపర్ స్టార్స్ తో కలిసి నటించాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఇలా అప్పటి సూపర్ స్టార్స్ తో చిరంజీవి స్క్రీన్ ని షేర్ చేసుకున్నాడు. కానీ స్టార్ హీరో అయ్యాక ఆయన మల్టీస్టారర్ సినిమాలు చెయ్యలేదు. రెండు మూడు చేసే అవకాశం వచ్చినా అవి కార్యరూపం దాల్చడంలో సఫలం కాలేదు.

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి సమకాలీన హీరోలు కూడా కలిసి సినిమాలు చేసేస్తున్న రోజులివి. అయితే కొన్నేళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వం లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో టీ సుబ్బిరామిరెడ్డి నిర్మాతగా ఒక సినిమాని ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ ని చిరంజీవి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కించాలని సుబ్బిరామిరెడ్డి చాలా ప్రయత్నాలే చేసాడు. ఇద్దరు హీరోలు ఒప్పుకున్నారు కూడా, కానీ త్రివిక్రమ్ కి కథ ఎందుకో ఒక పట్టాన నచ్చడం లేదు, అందుకే ఆ స్క్రిప్ట్ ని భవిష్యత్తులో చేద్దామని,ప్రస్తుతానికి వద్దు అంటూ క్యాన్సిల్ చేసారు. అలా ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా మిస్ అయ్యింది. అయితే కొంతకాలం తర్వాత మళ్ళీ వీళ్లిద్దరు కలిసి నటించే అవకాశం వచ్చింది.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ #RRR చిత్రంతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. రాజమౌళి రామ్ చరణ్ ని వదులుతాడో లేదో అనే అనుమానంతో ఆయనని సంప్రదించకుండా కొరటాల శివ ముందుగా మహేష్ బాబు ని సంప్రదించాడు. మహేష్ బాబు కూడా పాజిటివ్ గానే రెస్పాన్స్ ఇచ్చాడు కానీ, చిరంజీవి పట్టుబట్టి ఆ క్యారక్టర్ ని రామ్ చరణ్ తో చేయించాడు. రాజమౌళి ని రామ్ చరణ్ డేట్స్ కోసం ఎంతో రిక్వెస్ట్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. మహేష్ బాబు సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నా కూడా ఆయనతో ఆ క్యారక్టర్ చేయించకపోవడానికి కారణం బడ్జెట్ భారీ గా పెరిగిపోతుందనే. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో రెండు సార్లు సినిమాలు మిస్ అయ్యాయి, భవిష్యత్తులో అయినా మళ్ళీ కలిసి సినిమా చేస్తారో లేదో చూడాలి.