Amisha Patel : బాలీవుడ్ లో ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు అమీషా పటేల్. ఆరోజుల్లో అమీషా పటేల్(Amisha Patel) అంటే కుర్రాళ్ళు మెంటలెక్కిపోయేవారు. తమకు అమీషా పటేల్ లాంటి హీరోయిన్ భార్య గా వస్తే ఎంత బాగుంటుందో అని అనుకునేవారు. అలాంటి క్రేజ్ ని చూసిన హీరోయిన్ ఆమె. అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి నటించిన ఆమె, మన టాలీవుడ్ ఆడియన్స్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power star Pawan Kalyan) తో బద్రి, సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) తో నాని వంటి సినిమాలతో పలకరించిన సంగతి అందరికీ తెలిసిందే. వీటిల్లో బద్రి చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. నాని సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది. అంతకు ముందు పవన్ కళ్యాణ్, అమీషా పటేల్ కాంబినేషన్ లో నువ్వే కావాలి సినిమా మొదలైంది కానీ, ఎందుకో మధ్యలోనే ఆ సినిమా వీళ్ళ కాంబినేషన్ లో ఆగిపోవడం, తరుణ్ కి షిఫ్ట్ అవ్వడం జరిగింది.
Also Read : పవన్ కళ్యాణ్ జీవితంలో దాచేసిన ఆ ప్రేమ కథ ఇదీ!
నాని చిత్రం తర్వాత ఈమె ఎన్టీఆర్(Junior NTR) తో ‘నరసింహుడు’ అనే సినిమా చేసింది . ఈ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్. ఇక ఆ తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ మరో సినిమా చేయలేదు. బాలీవుడ్ లోనే కొనసాగింది, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గానే ఆమె ‘గద్దర్ 2’ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకొని హీరోయిన్ గా మరోసారి తన ఉనికిని చాటుకుంది. ఇకపోతే అమీషా పటేల్ 5 పదుల వయస్సుకు దగ్గరగా వచ్చినప్పటికీ, ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. అందుకు కారణాలు ఏమిటో తెలీదు కానీ, రీసెంట్ గా ఈమె ప్రముఖ బాలీవుడ్ హీరో సంజయ్ దత్(Sanjay Dutt) పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. వీళ్లిద్దరి మధ్య ఇంత సాన్నిహిత్యం ఉందని మన టాలీవుడ్ ఆడియన్స్ కి ఈ వ్యాఖ్యలు ద్వారానే తెలిసింది.
ఆమె మాట్లాడుతూ ‘నాకు బాలీవుడ్ లో అత్యంత సన్నిహితులైన వారిలో సంజయ్ దత్ ఒకరు. ఆయన నన్ను తన సొంత ఇంటి మనిషి లాగా భావిస్తాడు. ఆయనకు నేను వెస్ట్రన్ డ్రెస్, స్లీవ్ లెస్ డ్రెస్, పొట్టి దుస్తులు వేసుకొని తిరగడం ఇష్టం ఉండదు. ముఖ్యంగా తన ఇంటికి వెళ్ళేటప్పుడు అలాంటివి వేసుకొని రావడానికి వీలు లేదు అని చెప్పేవాడు. సినిమాల్లో కూడా నేను సంజయ్ దత్ కారణంగానే పొట్టి దుస్తులు వేసుకోవడం తగ్గించాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు అని సంజయ్ దత్ గారు బాధపడుతూ ఉంటారు. నీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపించినా నన్ను పిలువు. నీకు కన్యాదానం నేనే చేస్తాను అంటూ చెప్పేవాడు’ అని అమీషా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : 46 ఏళ్ల వయసులో ఘాటు ఫోజులు.. ఇది అందాల రచ్చ !