India US Trade Deal: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప మొదలు పెట్టిన టారిఫ్ వార్‌కు అమెరికా సుప్రీం కోర్టు బ్రేక్ వేసింది. 2025 జనవరిలో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్.. ఏడాది మొత్తం టారిఫ్‌లు విధించడంపైనే దృష్టిపెట్టారు. మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా అన్ని దేశాల దిగుమతులపై 5 నుంచి 150 శాతం వరకు టారిఫ్‌లు విధించారు. మొన్నటి వరకు భారత్‌పైనా 50 శాతం టారిఫ్‌లు అమలయ్యాయి. ఇటీవల కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో 18 శాతానికి తగ్గించారు. అయితే ఈ టారిఫ్‌లు చెల్లుబాటు కావని, టారిఫ్‌లు విధించడం రాజ్యాంగ విరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ట్రంప్‌కు షాక్ తగిలింది. ఈ క్రమంలో భారత్‌తో ఇటీవల జరిగిన డీల్‌పై ప్రభావం పడకుండా జాగ్రత్త పడ్డారు. టారిఫ్స్‌పై తీర్పు ఇండియా–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ప్రభావితం చేయదని స్పష్టం చేశారు. ఈ డీల్ ప్రకారం భారత్ అమెరికాకు సుంకాలు చెల్లిస్తుందని వెల్లడించారు. ఇది రెండు దేశాల మధ్య ట్రేడ్ డొమైనేషన్ను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
మోదీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
తన అవసరం వచ్చినప్పుడు పొగడడం, అవసరం తీరాక కరివేపాకులా తీరిపారేయడం, ధూషించడం ట్రంప్‌కు అలవాటే. తాజాగా ప్రధాని మోదీని ’గొప్ప జెంటిల్‌మ్యాన్, తన వ్యతిరేకుల కంటే చాలా తెలివైనవాడు’ అని ట్రంప్ ప్రశంసించాడు. అయితే, ’అయినా మనల్ని మోసం చేస్తున్నారు, అందుకే ఈ డీల్‌లో ఇండియా సుంకాలు చెల్లిస్తుంది, అమెరికా చెల్లించదు’ అని విమర్శించారు. ఇది ట్రంప్ స్టైల్లోనే వ్యాపార «ధోరణిని తెలియజేస్తుంది.
భారత్‌పై ఎలాంటి ప్రభావం?
ఈ ఒప్పందం అమెరికా ఎగుమతులకు అడ్డంకులు తొలగించి, భారత్ ఉత్పత్తులపై సుంకాలు వసూలు చేస్తుంది. దీంతో ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది, అమెరికన్ కంపెనీలు లాభపడతాయి.ఎగుమతుల ధర పెరగడం ఎంఎస్‌ఎంలపై ఒత్తిడి పెంచుతుంది. కానీ మార్కెట్ యాక్సెస్ పెరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ఈ డీల్‌ను ప్రశ్నించకపోవడం వల్ల రెండు దేశాల వాణిజ్య స్థిరత్వం నిలుస్తుంది.
వాళ్లే సంబురాలు చేసుకుంటున్నారు..
మరోవైపు అమెరికా సుప్రీంకోర్టు టారిఫ్స్‌ను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుతో పలు దేశాలు సంబురాలు చేసుకుంటున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏళ్లుగా అమెరికాను మోసం చేసిన వాళ్లే పండగ చేసుకుంటున్నారని, ఇది ఎక్కువ కాలం నిలవదని స్పష్టం చేశారు. త్వరలో మార్పు రానుందని హెచ్చరించారు. ‘నేను మీకు హామీ ఇస్తున్నా’ అంటూ తన అధికార ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. విదేశాలను లక్ష్యంగా చేసి, అమెరికన్లను ఆనందపరిచే ప్రయత్నం చేశారు.
ఆ దేశాల్లో సంతోషం ఎందుకు?
సుంకాల రద్దు వల్ల భారత్, చైనా వంటి దేశాల ఎగుమతులు సులభమవుతాయి, ధరలు తగ్గి మార్కెట్లు విస్తరిస్తాయి. ట్రేడ్ డెఫిసిట్ ఒత్తిడి తగ్గుతుంది, ఉత్పత్తుల పోటీశక్తి పెరుగుతుంది. దేశీయ పరిశ్రమలకు రక్షణ బలహీనపడుతుంది, ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. ట్రంప్ ఈ సందర్భంగా కొత్త టారిఫ్స్ ప్రొపోజ్ చేసి, విధానాన్ని మార్చుకోవాలని సూచనలు ఇచ్చారు.
ట్రంప్ వ్యాఖ్యలు ’అమెరికా ఫస్ట్’ విధానాన్ని ప్రతిబింబిస్తాయి, భారత్‌తో డీల్‌ను బలపరుస్తాయి. భారత్ దీన్ని అవకాశంగా మలిచి, స్థానిక పరిశ్రమలు బలోపేతం చేసుకోవాలి. ఇక హెచ్చరిక అమెరికా మొదటి విధానాన్ని పునరుజ్జీవనం చేయాలని సంకేతం. కాంగ్రెస్‌తో కలిసి కొత్త చట్టాలు రూపొందించవచ్చు లేదా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉపయోగించవచ్చు. మొత్తంగా ట్రంప్‌లోని ఈ డైనమిక్ వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్యంలో అస్థిరతను కొనసాగించే అవకాశం ఉంది.