Couple Friendly First Week Collections: కొన్ని సినిమాలకు మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఎందుకో ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి చూడాలని అనుకోరు. ఓటీటీ ఉంది కదా, నాలుగు వారాల్లో వచ్చేస్తుందిలే, చిన్న సినిమాలకు కూడా టైం, డబ్బులు వృధా చేయడం ఎందుకు అనే మైండ్ సెట్ తో ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే కొన్ని చిన్న సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రావడం లేదు. అలాంటి సినిమాల్లో ఒకటి రీసెంట్ గా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly) అనే చిత్రం. సంతోష్ శోభన్(Santosh Sobhan), మానస వారణాసి(Manasa Varanasi) హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాకు మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంకేమి ఉందిలే వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా కాస్త లాంగ్ రన్ రావాల్సిన అవసరం ఉంది.
ఈ చిత్రం విడుదలై సరిగ్గా వారం రోజులు పూర్తి అయ్యింది. మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ లో మంచి రన్ ని సొంతం చేసుకుంటుంది కానీ, సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం సరిగా రన్ లేదు. అందుకే వసూళ్లు భారీగా ఉండడం లేదు. ఏ సినిమాకు అయినా మంచి షేర్ వసూళ్లు రావాలంటే సింగిల్ స్క్రీన్స్ తప్పనిసరి. ఎందుకంటే అద్దె తక్కువ కాబట్టి. కానీ మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ లో % బేసిస్ మీద షేర్స్ ఇస్తారు కాబట్టి, టాక్సులు కట్టిన తర్వాత నిర్మాతకు మిగిలే డబ్బులు చాలా తక్కువ. అందుకే ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రానికి భారీ షేర్స్ నమోదు అవ్వడం లేదు. నిన్న బుక్ మై షోలో ఈ చిత్రానికి 13 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అంటే నిన్న విడుదలైన సుహాస్ ‘హే బల్వంత్’ చిత్రం తో సమానం అన్నమాట. కానీ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసా, అక్షరాలా పాతిక లక్షల రూపాయిలు.
ఓవరాల్ గా మొదటి వారం ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ప్రాంతాల వారీగా చూస్తే నైజాం ప్రాంతం నుండి 1 కోటి 51 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, ఆంధ్రా + సీడెడ్ నుండి 1 కోటి 61 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 3 కోట్ల 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి మొదటి వారంలో 87 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా మొదటి వారం వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 4 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి అన్నమాట. బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవాలంటే మరో రెండున్నర కోటి రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. ప్రభాస్ తో రీసెంట్ గానే ఈ మూవీ టీం ప్రమోషనల్ ఇంటర్వ్యూ ని ఇప్పించుకున్నారు కాబట్టి, ఈ వీకెండ్ వసూళ్లు భారీ గా పుంజుకుంటాయని ఆశిస్తున్నారు విశ్లేషకులు.