HomeతెలంగాణKTR: మత్తు వ్యవహారాలు.. హీరోయిన్స్ తో సంబంధాలు.. ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..

KTR: మత్తు వ్యవహారాలు.. హీరోయిన్స్ తో సంబంధాలు.. ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..

KTR: భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల కాలంలో మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు సాగిస్తున్నారు. సర్ ప్రక్రియ మీద పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పిస్తున్నారు. అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు.. పూర్తిస్థాయిలో డిజిటల్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకొని కార్యకర్తలకు అర్థమయ్యే విధంగా లెక్కలతో సహా చెబుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను గణాంకాలతో సహా వివరిస్తున్నారు. ఇక్కడితో కేటీఆర్ ఆగిపోలేదు. సమయం […]

KTR: భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల కాలంలో మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు సాగిస్తున్నారు. సర్ ప్రక్రియ మీద పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పిస్తున్నారు. అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు.. పూర్తిస్థాయిలో డిజిటల్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకొని కార్యకర్తలకు అర్థమయ్యే విధంగా లెక్కలతో సహా చెబుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను గణాంకాలతో సహా వివరిస్తున్నారు.

ఇక్కడితో కేటీఆర్ ఆగిపోలేదు. సమయం దొరికిన ప్రతి సందర్భంలో తన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ డిజిటల్ మీడియా ఛానల్ ముఖాముఖిలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు పదే పదే వేసే ప్రశ్నలను ఆ వ్యాఖ్యాత కూడా అడిగింది. ఆ ప్రశ్నలకు కేటీఆర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇంకోసారి తనను ఈ స్థాయిలో ఇబ్బంది పెడితే తీసుకున్న చర్యలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరించారు.

“నేను జీవితంలో పొగ తాగలేదు. మందు కూడా ముట్టలేదు. నేను హీరోయిన్లతో దగ్గరగా ఉన్నానని వీడియోలు సృష్టించారు. రకరకాల ప్రచారాలు మొదలుపెట్టారు. వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డారు. కాపురాలు కూల్చానని ఒక మంత్రి ఆరోపించారు. దీని వెనుక ముఖ్యమంత్రి కుట్ర ఉంది. ఇవన్నీ చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు నాకు వాటితో ఏం సంబంధం.. నాకు ఏం అవసరం.. ఎందుకొచ్చాం రా బాబు ఈ రాజకీయాల్లోకి అనిపించేది. కొన్ని సందర్భాలలో ఏదైనా మంచి పని చేసినప్పుడు ప్రజల నుంచి ప్రశంస లబించినప్పుడు గొప్పగా ఉండేది. ఉగాది పండుగ సందర్భంగా షడ్రుచుల సమ్మేళనం మాదిరిగానే రాజకీయాలు కూడా ఉంటాయని అర్థమైంది. నేను రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు మా అమ్మ నువ్వు ఎక్కువ రోజులు ఇందులో ఉండవు అని చెప్పింది. ఎందుకంటే నీ వ్యవహార శైలికి ఇది సరిపోదని మా అమ్మ అనేది. కానీ ఇప్పుడు నేను కూడా అడ్జస్ట్ అవుతున్నానని”కేటీఆర్ వ్యాఖ్యానించారు.

చాలా కాలం తర్వాత తన మీద వస్తున్న విమర్శలకు కేటీఆర్ సరైన సమాధానం చెప్పారు. తన రాజకీయ లక్ష్యాలు.. నిర్దేశించుకున్న మార్గాలు.. వంటి వాటిపై ఫుల్ క్లారిటీతో సమాధానాలు చెప్పారు. ఇటీవల కాలంలో కేటీఆర్ ఈ స్థాయిలో మాట్లాడటం ఇదే తొలిసారి. ఒకరకంగా తన అంతరంగాన్ని పూర్తిగా ఆవిష్కరించారు. తన మీద వస్తున్న విమర్శలకు.. స్పష్టమైన సమాధానం చెప్పారు. అయితే దీనిపై కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper