Homeఅంతర్జాతీయంTrump Latest News: ట్రంప్‌ అమెరికాను అమ్మెస్తాడా..!?

Trump Latest News: ట్రంప్‌ అమెరికాను అమ్మెస్తాడా..!?

Trump Latest News: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా హెచ్‌–1బీ వీసాలకు వార్షిక ఫీజు లక్ష డాలర్లకు ఫెంచారు. ఇది సెప్టెంబర్‌ 21 నుంచి అమలులోకి వచ్చింది, ముఖ్యంగా కొత్త దరఖాస్తులకు వర్తిస్తుంది. ఇది అమెరికన్‌ కార్మికుల ఉద్యోగాలను కాపాడటానికి రూపొందించబడిన చర్యగా చెబుతున్నారు, కానీ ఇది భారత, చైనా నుంచి వచ్చే ఐటీ, టెక్‌ నిపుణులకు సవాల్‌గా మారింది. ఈ నిర్ణయాన్ని ట్రంప్‌ విధానాలతోపాటు, ఆయన గతంలో హోస్ట్‌గా ఉన్న ‘ద అప్రెంటీస్‌’ రియాలిటీ షోను తలపిస్తోంది. ఒక నాటకీయ ఎపిసోడ్‌లా కనిపిస్తుంది. దీంతో ట్రంప్‌ అమెరికాను అమ్మేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘అప్రెంటీస్‌’ షో ఫ్లాష్‌బ్యాక్‌..
2004 నుంచి 2015 వరకు ఎన్‌బీసీలో ప్రసారమైన ’ద అప్రెంటీస్‌’ షోలో ట్రంప్‌ 14 సీజన్లకు హోస్ట్‌గా ఉన్నారు. ఈ పోటీలో పాల్గొన్న వ్యాపార ఆశావాదులు వివిధ టాస్కులు పూర్తి చేసి, ’యు ఆర్‌ ఫైర్డ్‌!’ అనే ఊతæ పదంతో తొలగించబడతారు. విజేతకు ట్రంప్‌ సంస్థల్లో వర్షిక 2.5 లక్షల డాలర్ల కాంట్రాక్ట్‌ బహుమతిగా ఇవ్వబడుతుంది. ఈ షో ట్రంప్‌ను విజయవంతమైన వ్యాపారవేత్తగా చిత్రీకరించి, ఆయన రాజకీయ జీవితానికి పునాది వేసింది. ఇప్పుడు హెచ్‌–1బీ రుసుము పెంపును ఈ షో కోణంలో చూస్తే, ఇది కొత్త ’చాలెంజ్‌’లా కనిపిస్తుంది. విదేశీ నిపుణులు తమ విలువను నిరూపించుకోవాలంటే, కంపెనీలు లక్ష డాలర్లు భరించాలి లేదా వారు తప్పిపోతారని ట్రంప్‌ సందేశం. ఇది షోలోని బోర్డ్‌రూమ్‌ డ్రామాను గుర్తు చేస్తూ, వలస ప్రక్రియను ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చింది.

అమెరికన్‌ ప్రయారిటీలతో గందరగోళం..
ట్రంప్‌ ఆర్డర్‌ ప్రకారం, హెచ్‌–1బీ దరఖాస్తులకు వార్షిక లక్ష డాలర్ల రుసుము విధించడం అమెరికన్‌ ఉద్యోగాలను రక్షించడానికి, వీసా దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఉద్దేశించింది. వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ వ్యాఖ్యల ప్రకారం, ‘ఆ వ్యక్తి కంపెనీకి, దేశానికి విలువైనవారైతేనే ఉంటారు, లేకపోతే వెళ్లిపోతారు‘ అని చెప్పారు. ఇది అమెరికన్లను ప్రాధాన్యతగా చేసి, నిష్ణాతులకు మాత్రమే గొడుగు లేవని స్పష్టం చేస్తుంది. కానీ, ఈ ప్రకటన తలెత్తించిన గందరగోళం షో స్క్రిప్ట్‌లా ఉంది. ప్రాథమికంగా భయాన్ని పెంచి, తర్వాత స్పష్టీకరణలు ఇవ్వడం. వైట్‌ హౌస్‌ అధికారి అబిగైల్‌ జాక్సన్‌ ప్రకారం, ఈ రుసుము కొత్త దరఖాస్తులకు మాత్రమే, ప్రస్తుత వీసా ధారకులకు లేదు. అమెజాన్, మైక్రోసాఫ్ట్‌ వంటి టెక్‌ దిగ్గజాలు ఉద్యోగులకు విమానాశ్రయాల వద్ద ఆగమనం వాయిదా వేయమని సలహా ఇచ్చాయి. ఇది ట్రంప్‌ ’అమెరికా ఫస్ట్‌’ విధానాన్ని రియాలిటీ ఫార్మాట్‌లో ప్రదర్శించినట్లు కనిపిస్తుంది.

రియాలిటీ షో పాఠాలు..
’అప్రెంటీస్‌’ షోలో టాస్కులు పూర్తి చేయకపోతే ’ఫైర్డ్‌’ అవ్వడం లాగా, ఇక్కడ కూడా లక్ష డాలర్ల సవాలు దాటకపోతే వీసా అవకాశాలు తొలగిపోతాయి. ట్రంప్‌ యంత్రాంగం ఈ డ్రామాను ఉపయోగించుకుని, ప్రకటన తర్వాత 24 గంటల్లో స్పష్టీకరణలు ఇచ్చింది. ఏడాదికి ఒకసారి రుసుము చెల్లించాలి. ఇది షోలోని గందరగోళాన్ని పెంచి, తర్వాత రిసల్వ్‌ చేసి రేటింగ్స్‌ (పబ్లిక్‌ ఆంట్రెస్ట్‌) పెంచే టెక్నిక్‌. విమర్శకులు ఇది చిన్న సంస్థలకు ’ఫైర్డ్‌’ సిగ్నల్‌ అని చెబుతున్నారు. ఎందుకంటే అమెజాన్‌ వంటి దిగ్గజాలు భరించగలవు, కానీ బయోటెక్‌ స్టార్టప్‌లు మాత్రం ప్రపంచ నైపుణ్యాలను కోల్పోతాయి. ట్రంప్‌ సన్నిహితులు ఇది ’వ్యాపార ఒప్పందం’లా చెబుతున్నారు, విమర్శకులను ’కుట్రలు’ అని కొట్టిపారేస్తారు. ఈ డ్రామా వలస విధానాలను ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చి, జనాభా దృష్టిని ఆకర్షిస్తుంది.

ధనవంతులకు రెడ్‌ కార్పెట్‌..
హెచ్‌–1బీ రుసుము పెంపుతోపాటు, ట్రంప్‌ ’గోల్డ్‌ కార్డ్‌’ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టారు: 10 లక్షల డాలర్ల మొత్తం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌కు గిఫ్ట్‌ చేస్తే, విదేశీయులకు ఫాస్ట్‌–ట్రాక్‌ ఇమ్మిగ్రేషన్‌ వీసా లభిస్తుంది. ఇది పర్మనెంట్‌ రెసిడెన్సీ, సిటిజన్‌షిప్‌ మార్గాన్ని తెరుస్తుంది. మరోవైపు, ’ప్లాటినం కార్డ్‌’ (50 లక్షల డాలర్లు) కాంగ్రెస్‌ ఆమోదంతో వచ్చే అవకాశం ఉంది, ఇది 270 రోజులు అమెరికాలో ఉండి, అమెరికా బయటి ఆదాయాలపై పన్ను మినహాయింపు ఇస్తుంది. ఇవి హెచ్‌–1బీతో విభిన్నంగా, ధనవంతులకు ప్రత్యేక గేట్‌లు. గతంలో మార్చిలో ఫెడరల్‌ భవనాల అమ్మకం ప్రకటించి వెనక్కి తగ్గినట్లు, ఈ చర్యలు ట్రంప్‌ ’అమెరికాను అమ్మకానికి పెట్టడం’లా కనిపిస్తున్నాయని విమర్శకులు అంటున్నారు. ఇది వలలను పే చేసే’ వ్యవస్థగా మార్చి, సామాన్య నిపుణులకు మూత పడుస్తోంది.

చిన్న సంస్థలపై ప్రభావం..
దిగ్గజ కంపెనీలు లక్ష డాలర్లు భరించి, భారతదేశం నుంచి 71% హెచ్‌–1బీ వీసాలు పొందగలవు, కానీ బోస్టన్‌ బయోటెక్‌ ఫర్మ్‌ లేదా ఆస్టిన్‌ స్టార్టప్‌లకు ఇది ఘాటైన దెబ్బ. 2025 మొదటి అర్ధ సంవత్సరంలో అమెజాన్‌కు 12 వేలు, మైక్రోసాఫ్ట్‌కు 5 వేలకి పైగా వీసాలు ఆమోదమయ్యాయి. చిన్న సంస్థలు ప్రపంచ నైపుణ్యాలను తీసుకువచ్చి, క్యాన్సర్‌ మందులు, ఇన్నోవేషన్‌ చేయాలనుకుంటే, ఈ రుసుము కలలు కల్లలవుతాయి. ఇది అమెరికా కాంపిటిటివ్‌నెస్‌ను దెబ్బతీస్తుందని ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు అంటున్నారు. ట్రంప్‌ ప్రభుత్వం ఇది ’అమెరికన్‌ వర్క్‌ఫోర్స్‌’ రక్షణ అని చెబుతున్నప్పటికీ, చిన్న బిజినెస్‌లు విదేశాల వైపు మళ్లుతాయనే ఆందోళన ఉంది. ఈ చర్యలు అమెరికా విశ్వసనీయతను పరీక్షిస్తున్నాయి, ఎందుకంటే వలసదారులకు ’లిబర్టీ’ స్వాగతం ఇచ్చే స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ ప్రతిరూపం ఇప్పుడు ’పే టు ప్లే’గా మారుతోంది.

హెచ్‌–1బీ రుసుము పెంపు ట్రంప్‌కు ఒక కొత్త ’అప్రెంటీస్‌’ ఎపిసోడ్‌లా పని చేస్తోంది. డ్రామా సృష్టించి, స్పష్టీకరణలతో ఆకట్టుకోవడం, ధనవంతులకు గోల్డ్‌ కార్డులు ఇచ్చి సమతుల్యం చేయడం. ఇది అమెరికా వలస విధానాన్ని వ్యాపార షోగా మార్చి, సామాన్య నిపుణులకు సవాలుగా మారింది. చిన్న సంస్థలు, స్టార్టప్‌లు దెబ్బతింటే, అమెరికా ఇన్నోవేషన్‌ దెబ్బతింటుంది. ట్రంప్‌ యంత్రాంగం విమర్శలను ’కుట్రలు’ అని కొట్టిపారేస్తుంటే, ఈ ’షో’ రేటింగ్స్‌ (పబ్లిక్‌ సపోర్ట్‌) పెంచుతుంది కానీ, దీర్ఘకాలంలో అమెరికా ’లిబర్టీ’ ఇమేజ్‌ను దెబ్బతీస్తుంది. భవిష్యత్‌ ఎపిసోడ్‌లో ఈ డ్రామా ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. కానీ వలసదారులకు ‘ఫైర్డ్‌’ భయం తగ్గకపోతే, అమెరికా కలలు దూరమవుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular