Donald Trump: అమెరికా 47 అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025, జనవరి 20 బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమేరకు అధికార మార్పిడికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ట్రంప్ కూడా తన కేబినెట్‌లో మంత్రులను, వైట్‌హౌస్(White House) అధికారులను ఎంపిక చేసుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మంత్రులు, అధికారులు కూడా క్రమంగా బాధ్యతలు స్వీకరించనున్నాయి. అయితే అమెరికా చరిత్రలోనే ట్రంప్ ఓ చెత్త రికార్డు తన పేరిట నమోదు చేసుకున్నారు. దోషిగా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న నేతగా అమెరికా చరిత్రలో నిలిచిపోయారు. ఇన్నేళ్ల అమెరికా చరిత్రలో దోషిగా బాధ్యతలు చేపట్టనున్న మొట్టమొదటి నేత ట్రంప్. హష్ మనీ కేసులో ఆయనపై నమోదైన కేసులు న్యూయార్క్ న్యాయస్థానం ఇదివరకే ఆయనను దోషిగా తేల్చింది. 2025, జనవరి 10 శిక్ష ఖరారు చేసింది. ఈమేరకు తీర్పు వెలువరించింది. అధ్యక్షుడు కాబోతున్న నేపథ్యంలో ఆయనకు అన్‌కండీషనల్ డిశ్చార్జ్, (Unconditional Discharge) విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ప్రకటించారు. దీంతో దోషిగా తేలినప్పటికీ ట్రంప్ ఎలాంటి జైలు శిక్ష, జరిమానా చెల్లించాల్సిన అవసరంలేదు. అయితే దోషిగా నిర్ధారణ అయిన తొలి అమెరికా అధ్యక్షుడుఇగా ట్రంప్ నిలిచారు.
నిర్దోషినే అని వాదన..
వర్చువల్‌గా జనవరి 10న నూయార్క్ కోట్టు జడ్జి జువాన్ ఎం.మెర్చన్ ఎదుట హాజరైన ట్రంప్ తాను నిర్దోషినే అని వాదించారు. ఏ తపుప చేయలేదని, మరోసారి న్యాయమూర్తికి విన్నవించారు. ఇటీవల ఎన్నికల్లో తనకు లక్షలాది ఓట్లు వచ్చాయని, పాపులర్ ఓటులో తానే విజయం సాధించానని తెలిపారు. ఏడు స్వింగ్ రాష్ట్రాల్లోనూ గెలిచానని చెప్పారు. ఈ కేసులో రాజకీయ కోణం ఉన్నందున తన ప్రతిష్టను దెబ్బతీసేలా చేశారని ఆరోపించారు. ట్రంప్ న్యాయవాది కూడా ఇదే వాదనలు వినిపించారు. అయతే ఇప్పటికే దోషిగా తేలిన నేపథ్యంలో న్యాయమూర్తి ఈ వాదనలను పట్టించుకోలేదు. తీర్పు వెల్లడించారు.
అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతోనే..
హష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా తేలారు. అయితే నవంబర్‌లోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. కానీ అదే సమయంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో క్రిమినల్ విచారణ ఎదుర్కొనకుండా రక్షణ ఉందని ట్రంప్ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. విచారణ జరిపిన కోర్టు ఈ కేసుకు సంబంధించిన శిక్షను వాయిదా వేసింది. చివరకు జనవరి 10న శిక్ష విధిస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా తీర్పు వెల్లడించింది.
ఏంటి కేసు..
అమెరికా నటి స్టార్మీ డానియల్స్, ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారనేది ఆరోపిన. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ విషయం బయటకు చెప్పకుండా ట్రంప్.. ఎన్నికల విరాళాల నుంచి 1.30 లక్షల టాలర్లు స్టార్మీ డానియల్స్‌కు ఇచ్చినట్లు అభియోగాలు ఉన్నాయి. దానిని కప్పిపుచ్చుకునేందుకు రికార్డులు తారుమారు చేశారు. ఇలా మొత్తంగా 34 అంశాలపై అభియోగాలు ఉన్నాయి. ఆరు వారాల విచారణ అనంతరం నేరం నిరూపణ అయింది. 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ట్రంప్‌ను దోషిగా తేల్చింది. మరోవైపు స్టార్మీ కూడా తాము ఏకాంతంగా గడిపినట్లు వాంగ్మూలం ఇచ్చింది. మరోవైపు 22 మంది సాక్షులు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా చెప్పారు.