Dan Bilzerian : చేతినిండా అపరిమితమైన డబ్బు.. 24 గంటలూ చుట్టూ అమ్మాయిలు.. మద్యం తాగుతాడు.. జూదం ఆడుతాడు. ప్రమాదకరమైన ఆయుధాలతో చెలగాటం ఆడుతాడు.. ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గుడిగా పేరుపొందాడు. అతడి బ్రాండ్ పేరు మీద విమానాలు ఉంటాయి. హెలికాప్టర్లు ఉంటాయి..ఫైటర్ జెట్ లు ఉంటాయి. నీటి పై తెలియాడే ఓడలు ఉంటాయి. ఇక వాహనాలకైతే లెక్కే లేదు. ఆడి నుంచి బీఎండబ్ల్యూ దాకా.. అత్యంత ఖరీదైన కార్లు అతడి షెడ్లో కొలువుదిరి ఉంటాయి. ఇంతకీ ఎవరతను అంటే..
విలాస పురుషుడు
అతని పేరు డాన్ బిల్జెరియన్.. పేరులోనే ఉన్నట్టు అతడి వ్యవహారాలు మొత్తం డాన్ తరహాలో కొనసాగుతుంటాయి. అతడి సోషల్ మీడియా ఖాతాలను చూస్తుంటే మతి పోయినంత పనవుతుంది. ఎప్పటికీ పార్టీలు.. చుట్టూ అమ్మాయిలు.. మద్యం తాగుతూ.. వారితో సరస సల్లాపాలు కొనసాగిస్తూ కనిపిస్తుంటాడు. ఇతడిని జూదగాడు అని పిలుస్తుంటారు. అమెరికాలోని ఫరుడాలో డిసెంబర్ 7 1980 జన్మించాడు.. విలాసవంతమైన జీవితానికి.. విశృంఖల మైన వ్యక్తిత్వానికి ఇతడు పెట్టింది పేరు. సోషల్ మీడియాలో ఈమా యాక్టివ్గా ఉండే ఇతడు కొద్దిరోజులుగా కనిపించడం లేదు.. వాస్తవానికి విలాసవంతమైన జీవనశైలిని గడిపిన ఈ వ్యక్తి ఒక్కసారిగా కనిపించకపోవడం చర్చకు దారి తీస్తోంది.. ఇంతకీ అతడికి ఏమైంది? తనకు తానుగా చనిపోయాడా? లేక ఎవరైనా చంపేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
శ్రీమంతుల కుటుంబంలో జన్మించాడు
డాన్ బిల్జెరియన్ శ్రీమంతుల కుటుంబంలో జన్మించాడు. ఇతడి తండ్రి పేరు పాల్ బిల్జేరియన్.. ఇతడు ఒక ఏజెన్సీ రైడర్ గా పనిచేసేవాడు. మోసం కేసులో 13 నెలల దాకా జైలు శిక్ష అనుభవించాడు. చిన్నప్పటినుంచి డాన్ కు చదువుపై పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అతడు ఒకసారి పాఠశాలకు వెళ్తున్నప్పుడు తనతోపాటు తుపాకీ తీసుకెళ్లాడు. దీంతో అతని స్కూల్ నుంచి బహిష్కరించారు. అప్పట్లోనే అదరి వద్ద 95 తుపాకులు దాకా ఉండేవట. మొదట్లో నేవీ సీల్ కమాండో కావాలి అనేది డాన్ కోరిక. అయితే శిక్షణ సమయంలో నేవీ అధికారితో తీవ్రంగా గొడవపడ్డాడు. అందువల్లే అతడిని ఇంటికి పంపించారు. ఆ తర్వాత అతడు ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో చదివేందుకు వెళ్ళాడు. అయితే అక్కడ కూడా స్థిరంగా ఉండలేకపోయాడు.
జూదం అలా అలవాటయింది
యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చిన తర్వాత డాన్ కు జూదం అలవాటయింది. అలా అందులో లక్కీ హ్యాండ్ గా పేరు పొందాడు. ఒకరోజు రాత్రిలోనే దాదాపు 86 కోట్ల సంపాదించాడు. దీంతో అతని పేరు మారుమోగిపోయింది. అలా జూదమాడుతూ ఏకంగా 300 కోట్లకు పైగా సంపాదించాడు..ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 32 మిలియన్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. 2023 వరకు అతడి సంపద ఏకంగా 2,550 కోట్లు. జూదంలో తిరుగులేని ఆటగాడిగా పేరుపొందిన డాన్.. మొదటినుంచి వివాదాస్పద వ్యక్తిగా పేరుపొందాడు. 2014లో బాంబు తయారుచేస్తుండగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అంతేకాదు అప్పట్లో వయోజన చిత్రాల నటి జీత్ గ్రిఫిత్ నగ్నంగా ఉన్నప్పుడు.. ఆమెను మొదటి అంతస్తు నుంచి స్విమ్మింగ్ పూల్ లోకి విసిరి వేశాడు. దీంతో ఆమె గాయపడింది. ఈ క్రమంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో కొంతకాలం డాన్ జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత ఒక నైట్ క్లబ్ లో ఒక మహిళను కాలితో తన్నాడు. నీతో ఆమె కూడా కేసు పెట్టడంతో జైలు శిక్ష అనుభవించాడు.
రెండుసార్లు గుండెపోటుకు గురయ్యాడు
ఇక డాన్ కు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రెండుసార్లు గుండెపోటు వచ్చింది. అతడు అతిగా మద్యం తాగుతాడు. మాదకద్రవ్యాలు కూడా తీసుకుంటాడు. లెక్కకు మించి మహిళలతో లైంగిక సంబంధాలను కలిగి ఉన్నాడు. లైంగిక కార్యకలాపాలకు పాల్పడే సమయంలో మాదకద్రవ్యాలను తీసుకుంటాడు. అయితే అతడి ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో అతడిని ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఒకసారి గుండెపోటు వచ్చినప్పుడు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుండగానే అతడికి మరోసారి గుండెపోటు వచ్చింది. అయితే వాటి నుంచి కోలుకున్నాడని అతని అభిమానులు చెబుతుంటారు. అతనికి మొసళ్ళు, పాములతో ఆడుకోవడం ఇష్టం.
సినిమాల్లోనూ నటించాడు
డాన్ 2013 నుంచి 2016 వరకు అనేక సినిమాలో నటించాడు.. అంతేకాదు టొరంటో స్టాక్ ఎక్స్చేంజిలో ఇగ్నైట్ అనే కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. ఆ కంపెనీ లక్ష్మీ పత్రి, వ్యాపింగ్, నికోటిన్ ఉత్పత్తులను విక్రయిస్తుంది.. అయితే ఈ కంపెనీలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కార్టిస్ హెఫార్నాన్ ఆరోపించారు. దీంతో కంపెనీపై 2020లో దావా వేశారు. డాన్ వ్యక్తిగత ఖర్చులు 75 వేల అమెరికన్ డాలర్లు, ఇతరాల కింద 2,000,00 డాలర్లను కంపెనీ నిధుల నుంచి ఖర్చు చేశారు. ఇదే విషయాన్ని కార్టిస్ హెఫార్నాన్ లేవనెత్తడంతో ఆందోళన నెలకొంది.. ఫలితంగా ఇగ్నైట్ కంపెనీ షేర్ ధర 2019లో 2.5 డాలర్లు ఉండగా.. అక్టోబర్ 2020 నాటికి దాని ధర 0.28 డాలర్లకు పడిపోయింది. ఆ కంపెనీ 2019, 2020 లో వరుసగా 69 మిలియన్ డాలర్ల నష్టాలను చవిచూసింది. 2021లో కంపెనీ తిరిగి పుంజుకుంది. 78 మిలియన్ డాలర్ల లాభాలను చవిచూసింది. అయితే అకౌంటింగ్ మోసాలపై SEC విచారణ జరపడంతో.. మళ్లీ కంపెనీ విలువ దారుణంగా పడిపోయింది..ఇన్ స్టా గ్రామ్ లో డాన్ చాలా రోజులుగా యాక్టివ్ గా లేడు. 2023 -24 మధ్య కొన్ని పోస్టులు చేశాడు. దీంతో అతని ఫాలోవర్స్ తగ్గారు.. ఈ క్రమంలో అతడు మళ్ళీ యాక్టివ్ గా ఉంటాడా? సోషల్ మీడియాను షేక్ చేయగలడా? అసలు భూమ్మీద అతను బతికి ఉన్నాడా? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి..
పాడ్ కాస్ట్ లో ఏం చెప్పాడంటే..
ఇటీవలి పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో డాన్ సంచలన విషయాలు వెల్లడించాడు. “నేను దీన్ని పట్టించుకోను. సోషల్ మీడియా అనేది ఒక వీడియో గేమ్ లాంటిది. నేను ఎనిమిది సంవత్సరాల క్రితమే దీని విడిచిపెట్టాను. నేను ఇప్పటికే చాలా అలసిపోయాను. సోషల్ మీడియా అనేది ఒక క్యాన్సర్ లాంటిది. నా అభిప్రాయం ప్రకారం ఇది సమాజానికి ఏమాత్రం మంచిది కాదని” డాన్ వ్యాఖ్యానించాడు. దూకుడు వ్యక్తిత్వం ఉన్న డాన్ ఇలాంటి వ్యాఖ్యలు అప్పట్లో చేయడం సంచలనం కలిగించినప్పటికీ.. అతడు సోషల్ మీడియాలో వీడియోలు ఆడపాదడపా పోస్ట్ లు చేస్తూ ఉండటం విశేషం.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Don bilzerian is a gambler an alcoholic a womanizer the biggest villain in the world
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com