Google Doodle : ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్.. సాంకేతికత విషయంలో కొత్త కొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా తన యూజర్లను ఆకట్టుకునేందుకు వింత వింత ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. అయితే అవన్నీ కూడా ఆకట్టుకుంటాయి.. వినూత్నతకు పెద్దపీట వేయడంతో యూజర్లు గూగుల్ చేసే ప్రతీ పనిని ఆసక్తిగా గమనిస్తుంటారు.. పోటీగా మరే సంస్థ లేకపోవడంతో గూగుల్ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది.. మారుతున్న కాలానికి అనుగుణంగా అవి ఉండడం.. ఆసక్తికరంగా దర్శనం ఇస్తూ ఉండడం వల యూజర్లు ఫిదా అవుతుంటారు.
ప్రస్తుతం పారిస్ వేదికగా
పారాలింపిక్స్ జరుగుతున్నాయి.. ఈ పోటీలు వివిధ వైకల్యాలతో బాధపడుతున్న వారిలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు నిర్వహిస్తుంటారు. అలా అని ఈ పోటీలు అల్లాటప్పగా సాగవు. పారా అథ్లెట్లు హోరాహోరిగా పోటీ పడుతుంటారు. ఒక రకంగా ఒలింపిక్స్ లో కంటే ఎక్కువగా ఈ మ్యాచ్ లే రసవత్తరంగా జరుగుతుంటాయి. ఈ పోటీలకు మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు గూగుల్ తన వంతు బాధ్యతను భుజాలకు ఎత్తుకుంది. ఇందులో భాగంగానే డూడుల్ లో ఆ పోటీలకు ప్రాధాన్యం ఇస్తోంది. డూడుల్ లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తోంది. ఇటీవల వీల్ చైర్ టెన్నిస్ ను తన డూడుల్ లో గూగుల్ ప్రస్తావించగా… తాజాగా పవర్ లిఫ్టింగ్ పోటీలను ఆస్థానంలో చేర్చింది. సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు అరేనా పోర్టే డి లా చాపెల్లె లో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు ప్రతీకగా గూగుల్ ప్రత్యేకమైన డూడుల్ రూపొందించింది. ఈ డూడుల్ లో ఒక రొట్టెను చికెన్ ముక్క పైకి లేపుతోంది.. మరో కోడి పిల్ల పైన కూర్చొని ఆ రొట్టెను ఆస్వాదిస్తున్నట్టుగా ఆ దృశ్యం కనిపిస్తోంది..
సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది
పారా పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొనే అథ్లెట్లు ఏదో ఒక దిగువ అవయవాలలో శారీరక బలహీనతను కలిగి ఉండాలి. అది కనీస బలహీనత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఇక ఈ పవర్ లిఫ్టింగ్ పోటీలలో మొదటి రోజు మహిళల 45 కిలోల విభాగంలో చైనాకు చెందిన గుయో మొదటి స్థానం గెలిచింది. గ్రేట్ బ్రిటన్ కు చెందిన న్యూ సన్, టర్కీకి చెందిన మురత్లీ తర్వాతి స్థానాలలో నిలిచారు. పురుషుల 49 కిలోల భాగంలో జోర్డాన్ కు చెందిన ఖరాడా స్వర్ణం సాధించాడు. టర్కీకి చెందిన కయాపినార్ రజతం దక్కించుకున్నాడు. వియత్నామ్ కు చెందిన వీసీ లి కాంస్యం సాధించాడు.. అంతకుముందు సెప్టెంబర్ 2న గూగుల్ వీల్ చైర్ టెన్నిస్ పోటీలను పురస్కరించుకొని యానిమేటెడ్ పక్షులతో కూడిన రూపొందించింది. సెప్టెంబర్ మూడు దాకా ఇదే డూడుల్ ను థీమ్ ను కొనసాగించింది. ఆ డూడుల్ థీమ్ ఆకట్టుకోవడంతో.. అదే ఒరవడిని గూగుల్ కొనసాగిస్తోంది. తాజా డూడుల్ కూడా ఆకట్టుకునేలా ఉండడంతో నెటిజన్లు గూగుల్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇది ఆటగాళ్లలో మరింత సానుకూల దృక్పథాన్ని పెంచుతుందని వివరిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More