https://oktelugu.com/

Petrol: ప్రపంచంలోనే అత్యంత తక్కువ రేటుకు పెట్రోల్ దొరికే దేశం ఏంటో తెలుసా? మన కరెన్సీలో ఎంత తక్కువ అంటే?

పెట్రోల్‌.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ దీనికోసమే కొట్లాడుకుంటున్నాయి. పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి అగ్ర దేశాలు పోటీ పడుతున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 12, 2024 8:50 am
    Petrol(1)

    Petrol(1)

    Follow us on

    Petrol: ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులకు భారీగా డిమాండ్‌ ఉంది. ఇవి లేకుండా వాహనాలు నడిచే పరిస్థితి ప్రస్తుతతానికి లేదు. రవాణా వ్యవస్థ స్తంభించి పోతుంది. గంట పెట్రోల్‌ బంకులు మూసివేస్తేనే వాహనదారులు ఇబ్బంది పడతారు. ఇక సమ్మె సమయంలో అయితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు పెట్రోలియం సమ్మెలు జరుగకుండా చూస్తాయి. ఇక ప్రపంచ దేశాలు కూడా పెట్రోలియం ఉత్పత్తులకు విఘాతం కలుగకుండా చూస్తాయి. అయితే ఇదే సమయంలో ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తి కొన్ని దేశాల్లోనే జరుగుతుంది. ఆదేశాల నుంచే ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. భారీగా నిల్వలు మెయింటేన్‌ చేస్తున్నాయి. ఇక పెట్రోలియం ధరలు ప్రభుత్వాలకు మంచి ఆదాయ వనరుగా మారాయి. ఆయిల్‌ కంపెనీల పేరు చెప్పి పాలకులు సామాన్యులపై భారం మోపుతున్నాయి. దీంతో మన దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు రూ. వంద దాటేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి ధరలు పెంచుతాన్నాయి. అయితే ఆ దేశంలో మాత్రం ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు పెట్రోలియం లభిస్తుంది.

    ఈ దేశాల్లో చాలా తక్కువ..
    వివిధ దేశాలు వాటి ఉత్పత్తి మరియు ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి వివిధ పెట్రోల్‌ ధరలను కలిగి ఉంటాయి. పెట్రోల్‌ను కలిగి ఉన్న దేశాల జాబితా వెనిజులా ముందు ఉంటుంది. తర్వాత లిబియా, ఇరాన్, అంగోలా అల్జీరియా, ఉన్నాయి.

    వెనిజులాలో..
    వెనిజులాలో పెట్రోల్‌ అత్యంత చౌకగా లభిస్తుంది. గ్యాలన్‌ ధర రూ.4.97 అంటే. లీటరుకు రూ.1.34 మాత్రమే ఇంతకన్నా తక్కువ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఎందుకు అంత త్కువగ అంటే వెనిజులా పెట్రోల్‌ ఉత్పత్తి చేస్తుంది. పలు దేశాలకు ఎగుమతి చేస్తుంది.

    లిబియా
    లిబియాను స్టేట్‌ ఆఫ్‌ లిబియా అని కూడా పిలుస్తారు. ఈ దేశం కూడా పెట్రోల్‌ ఉత్పత్తి చేసే దేశం ఇక్కడ పౌరులు లీటరుకు రూ. 2.68కి పెట్రోల్‌ పొందవచ్చు. గ్యాలన్‌ ధర రూ. 9.93. చౌకైన పెట్రోల్‌ వెనుక కారణం దేశంలో శిలాజ ఇంధనాలు, చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి.

    ఇరాన్‌
    ఇక పెట్రోల్‌ ధర తక్కువగా ఉన్న మరో దేశం ఇరాన్‌. ఇక్కడ ఉత్పత్తి సగానికిపైగా ప్రపంచంలోని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఇక్కడ ఒక గాలన్‌ ధర రూ.16.56. అంటే ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.4.47 మాత్రమే.

    అంగోలా
    అంగోలా పెట్రోలియం పరిశ్రమ 2022లో సగటున రోజుకు 1.16 మిలియన్‌ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేసింది. ఈ దేశంలో ఒక్క గ్యాలన్‌ ధర రూ.99.37 అంటే.. సామాన్యులకు ఇక్కడ లీటర్‌ ధర రూ.26.8 మాత్రమే.

    అల్జీరియా
    అల్జీరియా కూడా శిలాజ ఇంధనాలు అధికంగా ఉన్న దేశం. ఇది చమురు ధరలు స్వయం సంచాలకంగా ఉంటాయి. దేశంలో గ్యాలన్‌ ధర రూ.105.13గా ఉంది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.28.3 మాత్రమే.