New Year 2024 Celebration: న్యూ ఇయర్ వేడుకలకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. 2023కు సెండాఫ్ చెప్పి.. 2024కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు ప్రపంచం మొత్తం రెడీ అవుతోంది. ప్రపంచమంతా ఒకే రోజు జరుపుకునే పండుగ ఇది. అయితే కొన్ని గంటలు అటూ ఇటుగా వేడుకలు జరుగుతాయి. అయితే కొన్ని దేశాలు కొత్త సంవత్సరానికి వెరైటీగా స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది. ఆ వెరైటీ వెల్‌కమ్ ఏంటో చూద్దాం.
= డెన్మార్క్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యుల అందరూ కలిసి తలుపుల వద్ద పాత ప్లేట్లు, గ్లాసులను విసిరి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ విధంగా చేయడం వలన చెడు ఆత్మలు అదృశ్యమవుతాయని ఆ దేశ ప్రజల నమ్మకం. ఎవరి ఇంటి గుమ్మం వద్ద విరిగిన పాత్రలు ఎంత ఎక్కువ పేరుకుంటే.. ఆ ఇంట్లోని సభ్యులకు అంత మంచి జరుగుతుందని డెన్మార్క్ వాసుల విశ్వాసం.
= ఇక అమెరికాలో.. ప్రజలు టీవీలకు, ఆన్‌లైన్‌లకు అతుక్కుపోతారు. న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో నిర్వహించే బాల్ డ్రాప్ ఈవెంటే అందుకు కారణం. ఇక్కడి వన్ టైమ్స్ స్క్వేర్‌పై ప్రతి సంవత్సరం అర్ధరాత్రి బాల్ డ్రాప్ ఈవెంట్‌ను వీక్షిస్తారు. కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ.. ప్రత్యేకంగా రూపొందించిన బాల్‌ను 31వ తేదీన రాత్రి వన్ టైమ్స్ స్కైర్ పై నుంచి 11. 59 నిమిషాలకు డ్రాప్ చేస్తారు. ఇటీవల కాలంలో బాల్ డ్రాప్‌కు ముందు సంగీతకారుల ప్రదర్శనలతో లైవ్ ఎంటర్‌టై¯Œ మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌ను తొలిసారి ది న్యూయార్క్ టైమ్స్ న్యూస్‌పేపర్ యజమాని అడాల్ఫ్ ఓచ్స్ నిర్వహించారు. 1908 న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెబుతూ 1907 డిసెంబర్ 31న తొలిసారి బాల్ డ్రాప్ ఈవెంట్ జరిగింది.
= టైమ్స్ కొత్త ప్రధాన కార్యాలయ భవనాన్ని ప్రపంచం మొత్తం చూసేలా టపాసులు కాల్చి న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తారు. బంతి నిఆర్ట్‌క్రాఫ్ట్ స్ట్రాస్ కన్సల్టెంట్ కంపెనీ రూపొందించింది. 1907, డిసెంబర్ 31న మొదటిసారిగా బాల్ డ్రాప్ వేడుక న్విహించారు. 1942, 1943లో యుద్ధాల కారణంగా నిర్వహించలేదు.
= ఇప్పుడు బాల్ డిజైన్‌ను నాలుగుసార్లు ఆధునీకరించారు. తొలినాళ్లలో బాల 5 అడుగులు( 1.5 మీ) వ్యాసం కలిగి ఉండేది. దీనిని చెక్క, ఇనుముతో తయారు చేసేవాళ్లు. ఇది దాదాపు 100 బల్బులతో ప్రకాశిస్తుంది. ప్రస్తుత బంతి 12 అడుగులు(3.7 మీ) వ్యాసం కలిగి ఉంది. దీనిలో 32,00 ఎల్‌ఈడీ బల్బ్‌లను ఉపయోగిస్తున్నారు.
= బ్రెజిల్‌లో నూతన సంవత్సర వేడుకల కోసం ప్రజలు చాలా ప్రత్యేకమైన పనులు చేస్తారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక లోదుస్తులు ధరిస్తారు. దీంతొ కొత్త ఏడాదిలో అదృష్టం వరిస్తుందని నమ్ముతారు.
= ఫిన్లాండ్ ప్రజలు సంవత్సరంలో జరగనున్న విశేషాలను ఊహిస్తారు. దీని కోసం.. వారు కరిగించిన టిన్‌ను నీటిలో ముంచుతారు. లోహం గట్టిపడిన తర్వాత.. ఆకారంగా మార్చే పక్రియను చేపడతారు. ఈ లోహం హృదయం లేదా రింగ్ ఆకారంలో ఏర్పడితే అది వివాహం జరగడానికి చిహ్నంగా భావిస్తారు. ఓడలా రూపం మారితే దానిని ప్రయాణానికి చిహ్నంగా భావిస్తారు.
= స్పెయిన్‌లో.. కొత్త సంవత్సరం రోజున పాటించే సంప్రదాయం విచిత్రంగా ఉంటుంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్ష పండ్లను తింటారు. ఇది అక్కడి సంప్రదాయం. 12 ద్రాక్షలు 12 నెలలు.. ద్రాక్ష రాబోయే సంవత్సరంలో ఒకొక్క ద్రాక్ష పండు ఒకొక్క నెల అదృష్టంతో ముడిపడి ఉంటుందని స్పెయిన్ వాసుల నమ్మకం. స్పెయిన్‌లోని మాడ్రిడ్, బార్సిలోనాలాంటి బడా నగరాల్లో 12 ద్రాక్షను సామూహికంగా ఆరగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Do you know how different new year celebrations are celebrated in those countries
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com