Salaar Collections: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ వాళ్లకంటూ ప్రత్యేకత ను ఏర్పాటు చేసుకోవడానికి మంచి సినిమాలు చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ చేసిన సలార్ సినిమా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా 700 కోట్ల వరకు ఒక కలక్షన్స్ ని రాబట్టిందంటూ సినిమా యూనిట్ బయటకు చెప్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయి తొమ్మిది రోజులు గడుస్తున్నప్పటికీ తొమ్మిదవ రోజు ఈ సినిమా 8 కోట్ల వరకు నెట్ కలక్షన్స్ ని కలెక్ట్ చేసినట్టుగా సమాచారమైతే వస్తుంది.ఇక దానికి తగ్గట్టు గానే ఈ సినిమా కలక్షన్లు రోజురోజుకి డౌన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా యొక్క వసూళ్లను కనక మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఈ సినిమా 800 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టింది.ఇక పంగ్ రన్ లో 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని సినిమా యూనిట్ చెప్పినప్పటికీ ప్రస్తుతం వస్తున్న కలక్షన్స్ ను చూస్తే 1000 కోట్లు రావడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కలక్షన్స్ రోజు రోజుకు డౌన్ అయిపోతున్నాయి.
ఇంకొక వారం రోజులు అయితే సంక్రాంతి సినిమాలు బరిలోకి రాబోతున్నాయి కాబట్టి ఈ సినిమా కలక్షన్స్ చాలావరకు డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రభాస్ లాంటి స్టార్ హీరో నటించిన సలార్ సినిమా లాంగ్ రన్ లో 800 కోట్ల వరకు కలక్షన్స్ ని ఈజీగా వసూలు చేస్తుంది. అనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తో ప్రభాస్ మరొకసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తన పంజా ని విసిరాడు ఇక బాలీవుడ్ హీరోలకు సైతం ప్రభాస్ మరోసారి తన పంజా దెబ్బని రుచి చూపించాడు.ప్రభాస్ కి పోటీగా వచ్చిన డంకీ సినిమా డిజాస్టర్ అవడంతో సలార్ సినిమా మీద ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ సినిమాని ఒకటికి రెండు సార్లు చూడడంతో కలక్షన్లు భారీగా వసూలు చేశాయి.
ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ముందుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని ఊహించి ఈ సినిమాని చాలా భారీగా తెరకెక్కించాడు…ఇక ఇప్పుడు అప్పుడే ఇలాంటి సినిమా ఇండస్ట్రీ లో మరొక్కటి రాదు అని ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా సక్సెస్ మీద వాళ్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…