America Decreased Exports: ఒకప్పుడు అమెరికా ప్రయాణం అంటే ఎంతో ఇష్టపడిన వారు.. ఇప్పుడు భయపడి పోతున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల భయంతో అక్కడికి వెళ్లి ఎందుకు చాలామంది నిరాసక్త వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై 50% టాక్స్ విధించినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ టాక్స్ బాధ ఎందుకు అని.. కొందరు ఎగుమతులు చేయడం లేదు. ఇందులో భాగంగా గత ఏడాది కంటే ఇప్పుడు ఎగుమతుల శాతం భారీగా పడిపోయింది. భారత్ నుంచి అమెరికాకు ఆభరణాలు, ఔషధ ఉత్పత్తులు, టెక్స్టైల్ అండ్ గార్మెంట్లు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, వ్యవసాయ ఆహార ఉత్పత్తులు వంటివి ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే గత ఏడాది కంటే ఇప్పుడు ఎంతవరకు తగ్గింది? అనేది తెలుసుకుందాం..
2024 సంవత్సరంలో భారత్, అమెరికాల మధ్య 79.44 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగినట్లు సమాచారం. అయితే గత ఏడాది కంటే ఇప్పుడు అమెరికాకు ఎగుమతుల శాతం తగ్గినట్లు తెలుస్తోంది. 2024 ఆగస్టు నెలలో భారత్ నుంచి అమెరికాకు 6.86 మిలియన్ డాలర్లు ఉండగా.. 2025 ఆగస్టు నెలలో 6.86 డాలర్లు కొనసాగింది. అయితే ఎగుమతుల శాతం గత ఏడాది కంటే ఇప్పుడు 7.15 శాతం పెరిగింది. 2024 సెప్టెంబర్ నెలలో భారత్ నుంచి అమెరికాకు 5.46 బిలియన్ డాలర్లు ఉండగా.. 5.46 బిలియన్ డాలర్గా నమోదయింది. అయితే గత ఏడాది సెప్టెంబర్ తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ 11.7 శాతం ఎగుమతులు తగ్గాయి. ఆగస్టు 27 నుంచి డోనాల్డ్ ట్రంప్ ఎగుమతులపై 50 శాతం సుఖాలు విధించిన నేపథ్యంలో ఎగుమతుల శాతం తగ్గిపోయింది.
భారత్ నుంచి అమెరికాకు అనేక రకాల వస్తువులు ఎగుమతులు అవుతూ ఉంటాయి. భారత ఔషధ కంపెనీలో సుమారు 40 శాతం వరకు అమెరికాకే వెళ్తాయి. అమెరికా రిటైల్ మార్కెట్లో భారత టెక్స్టైల్ కు స్థిరమైన డిమాండ్ ఉంది. అందుకే ఇక్కడ ఉత్పత్తి అయిన రెడీమేడ్ వస్త్రాలు, కాటన్, సిల్కు ఉత్పత్తులు ఎక్కువగా అమెరికాకు వెళ్తుంటాయి. అలాగే భారతదేశానికి చెందిన ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో వంటి సంస్థలు అమెరికా కంపెనీలకు భారీగా సేవలు అందిస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్ తో పాటు ఐటీ కన్సల్టింగ్ సేవలను కూడా అమెరికా వినియోగించుకుంటుంది. ఇక భారత్లో ఉత్పత్తి అయిన ఆటోమొబైల్ భాగాలు, యంత్రాలు, విద్యుత్ పరికరాలు అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి.
భారత్ వ్యవసాయ ఆధారిత దేశం అని తెలిసిన విషయమే. దీంతో ఇక్కడ ఉత్పత్తి అయిన వ్యవసాయ ఆధారిత వస్తువులు అమెరికాకు ఎక్కువగా వెళుతుంటాయి. వీటిలో బాస్మతి బియ్యం, మసాలాలు, మిరియాలు, టీ కాఫీ వంటి వాటితోపాటు సముద్రపు చేపలు, ఫ్రాన్స్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అలాగే మొబైల్ భాగాలు, సర్క్యులేట్ బోర్డులు కూడా అమెరికా భారత్ నుంచి తెప్పించుకుంటుంది. అయితే భారత్కు చెందిన అన్ని వస్తువులపై అమరిక 50% సుంకాలు విధించిన తర్వాత వీటి ఎగుమతులు తగ్గిపోయాయి.