https://oktelugu.com/

Elon Musk : అతనికి అంత జీతం అవసరమా.. ఎలాన్‌ మస్క్‌ వేతనంపై కోర్టు కీలక తీర్పు!

ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌. త్వరలో ట్రంప్‌ ప్రభుత్వంలో డోజ్‌ కో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన వేతన ప్యాకేజీ అంశంపై కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. తాజాగా కోర్టు భారీ వేతనం వద్దని తీర్పు వెల్లడించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 4, 2024 / 02:12 AM IST

    Elon Musk

    Follow us on

    Elon Musk : అగ్రరాజ్యం అమెరికాలో త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వం ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్‌ సంస్థల సీఈవో ఎలాన్‌ మస్క్‌ డోజ్‌(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ) కో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మరో కో చైర్మన్‌గా వివేక్‌ రామస్వామి ఉండనున్నారు. ఇదిలా ఉంటే.. ఎలాన్‌ మస్క్‌ వేతన ప్యాకేజీపై మళ్లీ ఆయనకు చెక్కెదురైంది. భారీ వేతన ప్యాకేజీపై గతంలో ఇచ్చిన తీర్పునే తాజాగా కోర్టు సమర్థించుకుంది. షేర్‌ హోల్డర్ల ద్వారా డీల్‌ను ముందుకు తీసుకెళ్లాలని టెస్లా చేసిన ప్రయత్నాన్ని టెస్లా తిరస్కరించింది. మస్క్‌కు అంత ప్యాకేజీ ఇస్తే వాటాదారులకు అన్యాయం చేసినట్లే అని కోర్టు అభిప్రాయపడింది.

    వివాదం ఏమిటి?
    ఎలాన్‌ మస్క్‌ 2018లో అన్నిరకాల ప్రయోజనాలతో కలిసి 55.8 బిలియన్‌ డాలర్ల(భారత కరెన్సీలో రూ.4.5 లక్షల కోట్లు) వార్షిక వేతనం అందుకుంటున్నారు. కార్పొరేట్‌ చరిత్రలో ఇదే అత్యధిక వేతనం. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచాడు. అయితే మస్క్‌కు అధికంగా చెల్లించారంటూ వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్‌ టొర్నెట్టా డెలవేర్‌ కోర్టును ఆశ్రయించాడు. ఇంత వేతనం ఇవ్వడం రాపరేట్‌ ఆస్తులను వృథా చేయడమే అవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. అధిక వేతనం కారణంగా మస్క్‌ నియంత్రృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, తనకు నచ్చిన ప్యాకేజీ ఆమోదించాలని ఆదేశిస్తున్నారని ఆరోపించారు. ఆయన కారణంగా తాము స్వతంత్రంగా పని చేయలేకపోతున్నామని పేర్కొన్నాడు.

    గతంలోనే కోర్టు తీర్పు..
    విచారణ జరిపిన డెలవేర్‌ కోర్టు.. వేతన ప్యాకేజీ నిర్ణయించడంలో తప్పు జరిగిందని నిర్ధారించింది. అంత ప్యాకేజీకి ఆయన అనర్ముడని తేల్చింది. ఆ భారీ మొత్తాన్ని వదులుకోవాలని ఈ ఏడాది జనవరిలో తీర్పు వెలువరించింది. అయితే కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఈ ఏడాది జూన్‌లో టెస్లా వార్షిక సమావేశంలో ప్యాకేజీపై నిర్ణయం తీసుకున్నారు. వాటాదారులకు ఓటింగ్‌ నిర్వహించి మస్క్‌ వేతనం 55.8 బిలియన్‌డార్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపారు.

    మళ్లీ కోర్టుకు..
    దీంతో మస్క్‌ ఈసారి కోర్టును ఆశ్రయించారు. ఓటింగ్‌ను పరిగణనలోకి తీసుకుని ప్యాకుజీపై తీర్పును సవరించాలని కోరారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన కోర్టు మస్క్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. భారీ ప్యాకేజీ కారణంగా వాటాదారులు నష్టపోతారని తెలిపింది. దీనిపై మస్క్‌కు 345 మిలియన్‌ డాలర్ల అటార్నీ ఫీజులను విధిస్తున్నట్లు ప్రకటించింది. కోర్టు తీర్పుపై మస్క్‌ స్పందించారు. కంపెనీ ఓట్లపై నియంత్రణ వాటాదారులకే ఉండాలి.. కోర్టులకు కాదు అని తన ఎక్స్‌లో రాసుకొచ్చారు. టెస్లా కూడా స్పందించింది. తీర్పుపై అప్పీల్‌ చేస్తామని తెలిపింది.