Colombia : మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన డొనాల్డ్ ట్రంప్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. జనవరి 20న ఆయన బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్ష భవనంలోని అడుగు పెట్టిన మరు క్షణం నుంచే ఆయన తన మామీల అమలుపై దృష్టిపెట్టారు. ఈమేరకు ఒకేరోజు అనేక అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ప్రధానమైనవి వలసవాదులను తరలించడం, రెండోది జన్మతః వచ్చే పౌరసత్వం రద్దు. పౌరసత్వం రద్దు ఉత్తర్వులు అమలు కాకముందే విదేశీయులు కాన్పులు చేయించుకుంటున్నారు. ఇక అక్రమంగా అమెరికాలో ఉంటునర్నవారిని తరలించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. అరెస్టులు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నవారిని ప్రత్యేక విమానాల్లో వారి దేశాలకు పంపిస్తున్నారు. అయితే ఈ చర్యలను కొలంబియా(Colambia) ముందుగా వ్యతిరేకించింది. తాజాగా వెనక్కు తగ్గింది. అగ్రరాజ్యం పెట్టిన నిబంధనలకు తలొగ్గింది. కొలంబియా స్వదేశానికి తిరిగి వచ్చిన పౌరులను ఆహ్వానించడంతో తాము ఆ దేశంపై విధించిన సుంకాలు, పలు ఆంక్షలను నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నాడని, యూఎస్‌లో చట్టవిరుద్ధంగా ఆశ్రయం పొందుతున్న పౌరులను వెనక్కి పంపిస్తున్నాడని వౌట్‌హౌస్ ప్రకటించింది.
పలు దేశాల నుంచి వ్యతిరేకత..
అమెరికాలో అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో వారి దేశాలకు పంపానికి అగ్రరాజ్యం అనుసరిస్తున్న విధానాలపై పలు దేశాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఇలా వలసదారులను తీసుకొచ్చే విమానాలను తమ దేశంలోకి అనుమతించమని కొలంబియా మొదట తేల్చి చెప్పింది. కొలంబియా వలసదారులను తీసుకువచ్చే విమానాలను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు ఆదేశ అధ్యక్షుడు గుప్తావో పెట్రో ఇటీవల 6పకటించారు. వలసదారులను గౌరవంగా పంపించేందుకు అమెరికా నిబంధనలు రూపొందిస్తేనే వాటిని అనుమతిస్తామని తెలిపారు. ఇప్పటికే అమెరికా(America) సైనిక విమానాలను వెనక్కి పంపినట్లు పేర్కొన్నారు. వలసదారులను నేరస్థులుగా చిత్రీకరించకుండా అమెరికా పౌర విమానాల్లో పంపించాలని సూచించిచారు.
ట్రంప్ ఆగ్రహం..
ఇదిలా ఉంటే కొలంబియా నిర్ణయంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కొలంబియా ఉత్పత్తులపై సుంఖాలను 50 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. కొలంబియన్ ప్రభుత్వ అధికారుల వీసాలను వెంటనే రద్దు చేస్తామన్నారు. ఈ చర్యలు ఆరంభం మాత్రమే అని తర నిబంధనలు పాటించని ప్రపంచ దేశాలు తమ పౌరులను వెనక్కి తిరిగి ఆహ్వానించకపోతే మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా అనుసరిస్తున్న విధానంపై బ్రెజిల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా వలసదారుల చేతులకు సంకెళ్లు వేసి పంపించడాన్ని తీవ్రంగా పరిగనించింది. అయితే కొలంబియాపై అమెరికా చర్యలతో ఆ దేశ అధ్యక్షుడు వెనక్కి తగ్గాడు. సైనిక విమానాల్లో వస్తున్నవారిని ఆహ్వానిస్తన్నారు.