Pawan Kalyan: తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు పవన్ కళ్యాణ్. ఈయన గురించి ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. ఒకప్పుడు సినిమా హీరోగా ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్న రియల్ హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా ఎంత నిజాయితీగా సినిమాల పట్ల డెడికేషన్ తో వర్క్ చేస్తారో ప్రస్తుతం అలాగే ఏపీ డిప్యూటీ సీఎం గా కూడా అంతే డెడికేషన్ తో వర్క్ చేస్తున్నారు అంటూ జనాలు ప్రశంసిస్తున్నారు. దానికి తగ్గ ఫలితం కూడా చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అవినీతి అనేది ఎక్కడ లేకుండా తనదైన స్టైల్ లో తన పవర్ ను కాపాడుకుంటూ ఎదుటివాళ్లు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ పవర్ కట్ చేస్తాం అని రేంజ్ లో రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ లో ఒక గుణం అందరికీ బాగా నచ్చుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో అయిన, ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న తప్పు ఎవరు చేసినా సరే చివరికి తన సొంత ఇంటి మనుషులు చేసినా సరే అది తప్పు అంటూ ఓపెన్ గా చెప్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఎక్కడైనా తప్పు జరిగితే ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ నిర్మొహమాటంగా బయట చెప్పేస్తారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో చాలామంది అలా బయటకు చెప్పరు. ఇండస్ట్రీలో చాలామంది ఆ వ్యక్తి తప్పు చేశాడు అని బయట పెడితే ఎక్కడ తమ పేరుపై నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుందో అని భయం కారణంగా చాలామంది ఆ వ్యక్తుల తప్పులను బయట పెట్టరు.
అయితే సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ తర్వాత అలా నిజాయితీగా మాట్లాడే తెలుగు హీరో నేచురల్ స్టార్ నాని మాత్రమే అని ప్రేక్షకులు అంటున్నారు. ఎక్కడైనా అన్యాయం జరిగింది అని తెలిస్తే మొదటిగా హీరో నానినే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తారు. ఇక కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయంలో కూడా అందరికంటే మొదటగా రెస్పాండ్ అయ్యింది నానినే.
కేవలం అల్లు అర్జున్ విషయంలోనే కాకుండా ఇంకా చాలా విషయాలలో కూడా నాని తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పిన సంగతి తెలిసిందే. అధికార పార్టీలకు కూడా ఆయన ఇది చేయడం తప్పు అంటూ వేలెత్తి చూపించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అలాంటి దమ్మున్న రియల్ హీరో నేచురల్ స్టార్ నానినే అంటున్నారు జనాలు.ఇది ఇలా నాని ప్రస్తుతం శైలాష్ కోలాను దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నారు.