https://oktelugu.com/

Maldives: భారత్ అవుట్.. చైనా ఇన్.. మల్దీవులు ఏం కానుంది

గత ఏడాది చివరిలో ప్రధానమంత్రి లక్షద్వీప్ లో పర్యటించినప్పుడు.. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లక్షద్వీప్ లో పర్యటించాలని కోరారు. దీంతో మాల్దీవుల మంత్రులు వెటకారంగా ట్వీట్లు చేశారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 5, 2024 / 11:37 AM IST

    Maldives

    Follow us on

    Maldives: పాకిస్తాన్ సంక నాకిపోయింది. శ్రీలంక దేహి అని అడుక్కుంటున్నది. మయన్మార్ లో ఏ పూటకు ఆపుటే అన్నట్టుగా ఉంది. నేపాల్ ఆర్థిక కష్టాల్లో ఉంది. ఇవే కాదు ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఇవన్నీ చైనాతో దోస్తీ కొనసాగించినవే. మిడతలు వాలిన పొలం.. చైనా తో చేతులు కలిపిన దేశం బాగుపడట్టు చరిత్రలో లేదు. తాజాగా చైనాతో మాల్దీవులు దోస్తీ కట్టింది. అంతకుముందు మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు చైనా లో పర్యటించారు. అలా జరిగిన కొద్ది రోజులకే ఆ దేశం ఆర్థికంగా అత్యయిక పరిస్థితిని ఎదుర్కోవడం ప్రారంభమైంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థను బెయిల్ ఔట్ ప్రకటించాలని కోరింది.

    గత ఏడాది చివరిలో ప్రధానమంత్రి లక్షద్వీప్ లో పర్యటించినప్పుడు.. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లక్షద్వీప్ లో పర్యటించాలని కోరారు. దీంతో మాల్దీవుల మంత్రులు వెటకారంగా ట్వీట్లు చేశారు. దీంతో అది వివాదానికి దారి తీసింది. ఆ తర్వాత భారతీయ నెటిజన్లు స్పందించడంతో అది కాస్త ముదిరింది. ఫలితంగా మాల్దీవులకు భారతీయులు వెళ్లడం మానేశారు. దీంతో ఆ దేశం పర్యాటకంగా నష్టపోతోంది. చాలావరకు సంస్థలు గిరాకీ లేక దివాళా తీశాయి. దేశం ఆర్థికంగా నష్టపోవడానికి ముయిజ్జు విధానాలే కారణమని ఆరోపిస్తూ అక్కడి ప్రతిపక్షాలు ఆందోళన చేయడం మొదలుపెట్టాయి. ఇటీవల పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అయినప్పటికీ ముయిజ్జు వెనకడుగు వేయలేదు. పైగా చైనాతో దోస్తీ కట్టేందుకు మరింత ముందుకే వెళ్తున్నాడు. ఇప్పటికే తమ దేశం నుంచి భారత సైన్యాన్ని వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించిన ముయిజ్జు.. అందుకు సంబంధించి గడువు కూడా విధించాడు.

    భారత సైన్యాన్ని వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించిన ముయిజ్జు.. చైనా దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.. చైనా కూడా సైనిక పరంగా సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఒప్పందం కూడా కుదిరింది. ఈ ఒప్పందంతో మా బలోపేతమవుతుందని ఇరుదేశాల అధినేతలు ప్రకటించడం విశేషం..కాగా, ఈ రెండు దేశాల మైత్రి పై ప్రపంచ దేశాలు పెదవి విరుస్తున్నాయి. “చైనాతో దోస్తీ ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో పాకిస్తాన్, శ్రీలంక దేశాలను చూస్తే అర్థమవుతుందని.. మాల్దీవులు అధ్యక్షుడికి ఆ మాత్రం సోయి కూడా లేదా” అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.