Mahesh Babu: మనసంతా నువ్వే మహేష్ బాబు నుంచి ఉదయ్ కిరణ్ దగ్గరికి రావడానికి కారణం ఏంటో తెలుసా..?

జయంత్ సి పరంజి దగ్గర ప్రేమించుకుందాం రా సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేసిన విఎన్ ఆదిత్య ను ఎమ్మెస్ రాజు గారి దగ్గరికి తీసుకొచ్చాడు. దాంతో ఎమ్మెస్ రాజు ఒక చిన్న కథ చెప్పి దానికి బౌండెడ్ స్క్రిప్ట్ రాయమని చెప్పాడట.

Written By: Gopi, Updated On : March 5, 2024 11:35 am

Interesting Facts about Manasantha Nuvve Movie

Follow us on

Mahesh Babu: ఉదయ్ కిరణ్ హీరోగా 2001లో వచ్చిన మనసంతా నువ్వే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ హ్యాట్రిక్ హిట్లను నమోదు చేసుకున్నాడు. అయితే ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఒకానొక టైం లో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ అధినేత అయిన ఎమ్మెస్ రాజు(MS Raju) వరుసగా భారీ సినిమాలను తీస్తూ వరుస విజయాలను అందుకున్నాడు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వెంకటేష్ ను హీరోగా పెట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసిన దేవీ పుత్రుడు సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమాతో ఆయనకి చాలా నష్టాలు వచ్చాయి. ఇక దాంతో అప్పుడు చిన్న బడ్జెట్లో సినిమా తీసి పెద్ద హిట్టు కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇక అందులో భాగంగానే అతని ఫ్రెండ్ అయిన గోపాల్ రెడ్డి ఎమ్మెస్ రాజుతో నీకు ఒక కుర్రాడిని పరిచయం చేస్తాను మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి ఆయన మన బ్యానర్ లో సినిమా చేసి మనకు ఒక సక్సెస్ ని అందిస్తాడు అని చెప్పాడట ఆయనే విఎన్ ఆదిత్య…

ఇక జయంత్ సి పరంజి దగ్గర ప్రేమించుకుందాం రా సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేసిన విఎన్ ఆదిత్య ను ఎమ్మెస్ రాజు గారి దగ్గరికి తీసుకొచ్చాడు. దాంతో ఎమ్మెస్ రాజు ఒక చిన్న కథ చెప్పి దానికి బౌండెడ్ స్క్రిప్ట్ రాయమని చెప్పాడట. దాంతో ఆ చిన్న కథలోనే అప్పటికప్పుడు వి ఎన్ ఆదిత్య ఒక డైలాగు కూడా చెప్పాడు అది ఏంటి అంటే.. “ఒరేయ్ ఈ వర్షం కూడా మనకు అప్పుడప్పుడు మేలు చేస్తుంది రా.. మనం ఏడ్చినప్పుడు మన కన్నీళ్లు బయటకు కనిపించకుండా దాచేస్తుంది” అంటు హీరో ఫ్రెండ్ ఈ డైలాగ్ చెప్తాడని వి ఎన్ ఆదిత్య చెప్పాడు. ఇక దానికి ఇంప్రెస్ అయిన రాజు గారు అప్పటికప్పుడు 25 వేల చెక్ ఆయనకి ఇచ్చి దీనికి బౌండేడ్ స్క్రిప్ట్ ని రెడీ చేయమని చెప్పాడు.

అలా సినిమా స్క్రిప్ట్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ సినిమాలో మొదట హీరోగా మహేష్ బాబుని తీసుకుందామనుకున్నారు. కానీ మహేష్ బాబుకి ఆ స్టోరీ అంత పెద్దగా నచ్చకపోవడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు. దాంతో ఈ సినిమాకి కొత్తవాళ్లయితే బాగుంటుందని వి ఎన్ ఆదిత్య చెప్పడంతో అప్పటికే తేజ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇక తేజ డైరెక్షన్ లోనే మరొక సినిమా చేస్తున్నాడని తెలుసుకొని నువ్వు నేను సినిమా సెట్స్ కి వెళ్లి ఎమ్మెస్ రాజు ఉదయ్ కిరణ్ కి సంబంధించిన కొన్ని క్లిప్స్ చూసి అతన్ని హీరోగా ఫిక్స్ చేశాడు. అలా ‘మనసంతా నువ్వే’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా 1.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కితే దాదాపు 36 సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకొని 12 కోట్ల వరకు షేర్ ని వసూలు చేసింది. అలాగే 5 భాషల్లో రీమేక్ చేస్తే అన్ని భాషల్లో సూపర్ సక్సెస్ లను అందుకుంది…