China Smart Parking: పెరుగుతున్న నగరీకణతో పట్టణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు కనిపించడం లేదు. పట్టణాలు, నగరాలు కాంక్రీట్ జంగల్‌గా మారిపోతున్నాయి. ఇక మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సూపర్ బజార్‌ల వద్ద వాహనాలు నిలపడానికి కూడా స్థలం ఉండడం లేదు. స్థలం విలువైనది కావడంతో కమర్షియల్‌గా మార్చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పార్కింగ్ సమస్య పరిష్కారానికి చైనా స్మార్ట్ పార్కింగ్ విధానం అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతంది. బీజింగ్, షాంఘైలో బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా రియల్–టైమ్ మానిటరింగ్, స్పేస్ గైడెన్స్ అందిస్తున్నాయి. ఇవి డ్రైవర్లకు సమయం, ఇంధనం ఆదా చేస్తూ సేవా నాణ్యతను మెరుగుపరుస్తాయి.
ఆటోమేటెడ్ వాలెట్, రోబోటిక్ పార్కింగ్
హాంగ్జౌలో రోబోట్లు వాహనాలను స్వయంచాలకంగా పార్క్ చేస్తూ 400+ కార్లు ఒకే ప్రదేశంలో ఉంచుతున్నాయి. లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్, ఏఐ అల్గారిథమ్‌లతో ఎంట్రీ–ఎగ్జిట్ మేనేజ్ అవుతుంది. సంప్రదాయ పార్కింగ్‌కు రెండు రెట్లు స్థలం ఆదా అవుతుంది.
అప్లికేషన్–ఆధారిత చెల్లింపులు..
షాంఘై ’పార్కింగ్ 2.0’ ప్లాట్‌ఫాం 8,90,000+ స్పేస్‌లను కవర్ చేస్తూ ఆన్‌లైన్ రిజర్వేషన్, యూనిఫైడ్ పేమెంట్ సౌకర్యాలు అందిస్తుంది. బ్లూటూత్ టెక్నాలజీతో ఇండోర్ పొజిషనింగ్, షార్టెస్ట్ రూట్ గైడెన్స్ లభిస్తుంది. మెగ్నెటిక్ సెన్సార్లు, స్మార్ట్ బోలార్డ్‌లు రిమోట్ కంట్రోల్‌ను సాధ్యం చేస్తాయి.
2024–2030 మధ్య 27% సీఏజీఆర్‌తో చైనా స్మార్ట్ పార్కింగ్ మార్కెట్ 1,820 మిలియన్ డాలర్లకు చేరుతుంది. వెర్టికల్ టవర్లు, రొటరీ కరౌసెల్ సిస్టమ్‌లు డెన్స్ అర్బన్ ప్రాంతాల్లో స్థల ఉపయోగాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. అమెరికన్ వీడియోలు ఈ ఆవిష్కరణలను వైరల్ చేస్తూ ప్రపంచవ్యాప్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
A massive smart parking tower in Shenzhen that fits 1,600 cars with ease
— Tansu Yegen (@TansuYegen) November 28, 2025