Egg price in America: కోడిగుడ్డు మంచి పౌష్టికాహారం. రోజుకు ఒక కోడిగుడ్డు అయినా తినాలి అంటారు పెద్దలు. అయితే చాలా మంది కరోనా తర్వాత ఎగ్ తినడం ప్రారంభించారు. వారానికి మూడు లేదా నాలుగుసార్లు తింటున్నారు. అయితే అగ్రరాజ్యం అమెరికాలో గుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం అగ్రరాజ్యంలో డజను గుడ్ల ధర ప్రస్తుతం రూ.603 కు విక్రయిస్తున్నాడు. గడ్డు ఖరీదైనదిగా మారడానికి ట్రంప్ కారణమని డెమోక్రటిక్ నేతలు ఆరోపిస్తున్నారు. పెరుగుతున్న ధరలను ఎదుర్కొనడానికి ట్రంప్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోబైడెన్‌పై ట్రంప్ పదే పదే దాడి శారు. అయితే ధరలు పెరగకుండా నిరోధించడానికి ఏమీ చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా గెలిచిన ట్రంప్(Trump) ఏమీ చేయడం లేదు. కమోడిటీ ప్రైజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ట్రేడింగ్ ఎకనామిక్స్ ప్రకారం అమెరికాలో కొన్ని నగరాల్లో గుడ్లు డజన్‌కు 7 డాలర్లకు పెరిగింది. కొన్ని నగరాల్లో 6.55 డాలర్ల చొప్పున విక్రయిస్తున్నారు.
మంచి బ్రేక్‌ఫాస్ట్..
గుడ్డు అందరికీ మంచి బ్రేక్‌ఫాస్ట్(Breakfast). ప్రతీరోజు లక్షల మంది ప్రజలు గుడ్డు కొంటారు. కానీ, గుడ్డు ధరల తమ బడ్జెట్‌ను మించిపోతున్నాయి. టెక్సాస్ కాంగ్రెస్ మహిళ టెక్సాస్ కాంగ్రెస్‌లో మహిళ జాస్మిన్ క్రోకెట్‌తో పాటు పలువురు కిరాణ సామగ్రి ధరలు తగ్గిస్తానని ట్రంప్ చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసేందుకు సోష్ మీడియా ప్లాట్‌పాం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన వారం తర్వాత గుడ్ల ధర 40 శాతం పెరగడంపై ఆందోలన వ్యక్తం చేశారు.
బర్డ్ ఫ్లూ కారణంగా…
అమెరికాలో బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఇన్‌ఫ్లూఎంజా) వ్యాపిస్తోంది. దీంతో కోళ్లను పెద్ద ఎత్తున చంపేస్తున్నారు. ఇప్పటి వరకు 30 మిలియన్లకుపైగా కోళ్లను హతమార్చారు. ఈ కారణంగా గుడ్ల ఉత్పత్తి తగ్గింది. ధరలు పెరిగాయి. అయితే ట్రంప్ తీసుకున్న ఆహార దిగుమతుల పరిమితి నిర్ణయాలు కూడా గుడ్ల కొరత మరింత తీవ్రంగా మారిందని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలు అమెరికా ప్రజల ఆరోగ్యానికి, ఆర్థిక స్థితికి ముప్పుగా మారాయని బిల్ క్లింటన్ మాజీ క్యాబినెట్ కార్యదర్శి రాబర్ట్ రీచ్ విమర్శించారు. మరోవైపు ఎవీయన్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో బయటి నుంచి ఆహార దిగుమతులను నిరోధించాని డిపార్ట్‌మంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్‌ను కోరుతూ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలపై డెమోక్రాట్లు మండిపడుతున్నారు. ఏవీయన్ ఇన్‌ఫ్లూఎంజా(AVN influe Enja)కొత్తగా అమెరికాలోకి రాలేదని 2022 నుంచి అమెరికాలో ఉందని పేర్కొంటున్నారు. వైరస్ కారణాన్ని చూపి ధరలు పెంచడాన్ని తప్పు పడుతున్నారు.
చమురు ధరలపై ట్రంప్ విజ్ఞప్తి
ఇదిలా ఉండగా పెట్రోలియం ఉత్పత్తుల ధరల విషయంలోనూ ఒపెక్ దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. చమురు ధరలు తగ్గించడం ద్వారా రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపివేసేందుకు మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడ్డారు. దావోస్ సదస్సులో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. రష్యా–ఉక్రెయిన్ ఘర్షణకు ఒపెక్ దేశాల కూటమి విధానాలే కారణమని ఆరోపించారు.