Ravi Teja : చాలా కాలం నుండి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న మాస్ మహారాజ రవితేజ, ఇప్పుడు ‘మాస్ జాతర’ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు. లుక్స్ దగ్గరే ఆయన ఆడియన్స్ నుండి మార్కులు కొట్టేసాడు. రవితేజ కోరమీసం పెట్టాడంటే కచ్చితంగా సూపర్ హిట్ కొట్టినట్టే అని ఆయన ఫ్యాన్స్ కి ఒక నమ్మకం ఉంది. ఆయన కోర మీసం తో ఉన్న ‘దొంగోడు’, ‘విక్రమార్కుడు’, ‘క్రాక్’ చిత్రాలు కమర్షియల్ గా పెద్ద హిట్స్ అయ్యి రవితేజ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఇప్పుడు మాస్ జాతర కూడా అదే కోవకి చెందుతుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు ఫ్యాన్స్. నిన్న రవితేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి సోషల్ మీడియా లో అభిమానుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ టీజర్ ని చూసినప్పుడు అందరికీ అనిపించింది ఏమిటంటే రవితేజ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని ఫుల్లుగా వాడుకుంటూ, విక్రమార్కుడు తరహాలో మాస్ ఎలివేషన్ సన్నివేశాలు డిజైన్ చేసినట్టుగా అనిపించింది. అద్దం ముందు ఆయన తనని తానూ చూసుకుంటూ ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ని చూసినప్పుడు వెంకీ సినిమా లోని ట్రైన్ సన్నివేశం గుర్తొచ్చింది. టీజర్ లో హైలైట్ గా అనిపించిన షాట్స్ లో ఒకటి కత్తితో మీసం మెలి వేయడం. ఇలాంటివి యూత్ ఆడియన్స్ కి తెగ నచ్చేస్తాయి. అదే విధంగా హీరోయిన్ శ్రీలీల తో ఆయన ‘మనదే ఇదంతా’ అంటూ చెప్పే డైలాగ్, ఆయన పాత సినిమా ‘ఇడియట్’ ని గుర్తు చేస్తుంది. మొత్తం మీద ఈ టీజర్ ని చూసిన తర్వాత పాత రవితేజ ని మరోసారి చూసినట్టు అయ్యింది. రవితేజ లోని ఈ యాంగిల్స్ అన్ని బయటకి తీసే సినిమా ‘మిస్టర్ బచ్చన్’ అవ్వుద్దని అందరూ అనుకున్నారు.
కానీ ఆ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమాలో మిస్ అయ్యినవన్నీ ఈ చిత్రం లో చూడొచ్చు. ఈ చిత్రంతో భాను భోగవరాజు అనే నూతన దర్శకుడు మన టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. రవితేజ ఇప్పటి వరకు ఎంతో మంది కుర్ర డైరెక్టర్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీ లో వేరే లెవెల్ లో కొనసాగుతున్నారు. ఎక్కువ శాతం ఆయన కొత్త డైరెక్టర్స్ కి అవకాశం ఇచ్చాడు. ఒకప్పుడు అది బాగా కలిసొచ్చింది కానీ, ఇప్పుడు మాత్రం ఆయన కెరీర్ కి రిస్క్ చేసింది. మరి ఈ చిత్రం ఒకప్పటి లాగా రవితేజ కి కలిసి వస్తుందా, లేదా అనేది చూడాలి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ని అందించిన తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. గతంలో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ధమాకా చిత్రం మ్యూజిక్ పరంగా సెన్సేషన్ సృష్టించింది.