Pawan Kalyan: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారాన్ని కోల్పోయిన వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్తున్నారు. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి వైదొలిగారు. ఈ పరిణామం వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు కూటమిలో సైతం సెగలు పుడుతున్నాయి. లోకేష్ కు డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో అన్ని రాజకీయ పక్షాల్లో ఒక రకమైన గందరగోళం ఏర్పడుతోంది. తొలుత టిడిపి నేతలు లోకేష్ విషయంలో స్పందించారు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యే హోదా లోకేష్ కు ఉందని ప్రకటనలు చేశారు. అదే సమయంలో జనసేన నేతలు సైతం స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టిడిపి శ్రేణులు కోరుకుంటున్నట్టే.. పవన్ ఈ రాష్ట్రానికి సీఎం కావాలని జన సైనికులు కోరుకుంటున్నారని జనసేన నేతలు ప్రకటించారు. ఇది కాస్త వైరల్ అంశంగా మారి 2 పార్టీల మధ్య వాదనలకు దారితీసింది. దీంతో ఇరు పార్టీల నాయకత్వాలు స్పందించి ఇకనుంచి వాటిపై ఎవరూ మాట్లాడవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
* ప్రత్యేకంగా లేఖ
అయితే ఇంతటితో ఈ వివాదం ఆగే పరిస్థితి కనిపించకపోవడంతో పవన్( Pawan Kalyan) జనసైనికులకు ప్రత్యేకంగా విన్నవిస్తూ ఒక బహిరంగ లేఖ రాశారు. ప్రియమైన జనసైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు హృదయపూర్వక నమస్కారం అంటూ.. లేఖ రాయడం ప్రారంభించారు. “2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘనవిజయం చారిత్రాత్మకం. ఇది కేవలం ఒక్క కోటమి బలమే కాదు. గత ఐదేళ్లలో వైసీపీ సాగించిన నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహ చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రత వైఫల్యాలపై విసుగు చెందిన ప్రజలు సుస్థిర ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతోనే ఇది సాధ్యమైంది” అన్నారు పవన్.
* జన సైనికులకు స్పష్టమైన ఆదేశాలు
ఒక విధంగా చెప్పాలంటే జనసైనికులకు( janasena cader ) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు అయింది. అదే సమయంలో కూటమి సమన్వయం విషయంలో టిడిపి కూడా కట్టుబడి ముందుకు వెళ్లాలని పవన్ సూచించినట్లు అయ్యింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళ్దామని పవన్ పిలుపునివ్వడం విశేషం. కూటమిలోని మూడు పార్టీల శ్రేణులు బాధ్యతగా వ్యవహరించాలని పవన్ పిలుపునివ్వడం విశేషం. అనవసర వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్ళవద్దని.. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించవద్దని కూడా పవన్ సూచించడం విశేషం. తాను ఏ రోజు పదవుల కోసం రాజకీయాలు చేయలేదని.. ఇకముందు కూడా అలాంటి రాజకీయాలు చేయనని పవన్ స్పష్టం చేయడం విశేషం.
* క్రమశిక్షణ కట్టు దాటడంతో కూటమితో( Alliance ) పాటు జనసేనలో క్రమశిక్షణ( discipline) కట్టు దాటినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రావడంతో పవన్ స్పందించాల్సి వచ్చింది. ఒకవైపు జనసైనికులను కంట్రోల్ చేస్తూనే.. టిడిపి శ్రేణులకు సైతం సుతిమెత్తగా హెచ్చరించారు పవన్. కూటమి పార్టీల్లో విచ్ఛిన్నం తేవాలని వైసిపి సోషల్ మీడియా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా సీఎం, డిప్యూటీ సీఎం పదవుల విషయంలో జరుగుతున్న వివాదాన్ని మరింత రచ్చ చేసే ప్రయత్నంలో ఉంది. దానిపై సమాచారం అందుకున్న పవన్ కళ్యాణ్ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. అందుకే నేరుగా జన సైనికులకు బహిరంగ లేఖ రాస్తూనే.. మిగతా రెండు కూటమి పార్టీలకు సైతం స్పష్టమైన సంకేతాలు ఇవ్వగలిగారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan kalyans key message to jana sena party worker on issues
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com