Chernobyl Explosion: చెర్నోబిల్ అణు విస్పోటనం 1990లో పాఠాలు చదువుకున్నవారికి ఈ ఘటన గురించి తెలిసే ఉంటేంది. 1986లో జరిగిన భారీ అణు విపత్తు తర్వాత ఆ భూభాగం ప్రజలను తరలించారు. అక్కడికి ఎవరూ వెళ్లకుండా నిషేధించారు. దీంతో అడవులు మళ్లీ విస్తరించాయి. తోడేళ్లు, యూరేషియన్ లింక్స్ వంటి జంతువులు సమృద్ధిగా పెరిగాయి. ఆ ప్రాంతం వన్యప్రాణులకు సురక్షితమైన ఆశ్రయంగా మారింది. మానవ జోక్యం తక్కువగా ఉండటం వల్ల అనేక జాతులు తిరిగి వచ్చాయి.
కెమెరా ట్రాప్స్ ద్వారా పరిశోధన..
2020లో స్విత్లానా కుడ్రెంకో అనే పరిశోధకురాలు (జర్మనీలోని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేసినవారు) మార్కో హ్యూరిచ్ ప్రొఫెసర్ సహకారంతో ఈ విస్తృతమైన జోన్‌లో వైల్డ్‌లైఫ్ కెమెరాలు అమర్చారు. ఈ పని వైల్డ్ పోలిసియా ప్రాజెక్టులో భాగం. ఆమె జంతువుల సంఖ్య, వైవిధ్యం, ప్రవర్తనలను అధ్యయనం చేయడానికి ఈ కెమెరాలను ఉపయోగించారు.
2022 రష్యా ఆక్రమణ..
2022 ఫిబ్రవరి చివరి నుండి మార్చి చివరి వరకు రష్యా సైన్యాలు చెర్నోబిల్ ఎక్స్‌క్లూజన్ జోన్‌ను ఆక్రమించి సైనిక స్థావరంగా ఉపయోగించాయి. అయినప్పటికీ కెమెరాలు నిరంతరం చిత్రాలు, వీడియోలు రికార్డ్ చేశాయి. పరిశోధకులు 2022 కాలంలోని డేటాను 2021 అదే కాలంతో పోల్చి చూశారు. దాదాపు 2000 చిత్రాలు, వీడియోలను విశ్లేషించి జంతువుల కార్యకలాపాలలో మార్పులను గుర్తించారు.
జంతువుల ప్రవర్తనలో మార్పులు..
యుద్ధ కార్యకలాపాల తీవ్రత పెరిగేకొద్దీ క్షీరదాల దినచర్యలు స్పష్టంగా మారాయి. ఎర్రటి జింకలు, రో జింకలు, అడవి పందులు, నక్కలు వంటి జాతులు రాత్రి సమయంలో కార్యకలాపాలు తగ్గించాయి. కొన్ని జాతులు పగటి సమయంలో ఎక్కువగా కదలడం ప్రారంభించాయి. లింక్స్ జాతిలో మార్పులు చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తం మీద జంతువుల కార్యకలాపాలు తగ్గాయి, ముఖ్యంగా రాత్రిపూట. కొన్ని జాతులు మానవ సమీప ప్రాంతాల వైపు కదలికలు చూపించాయి.
ఈ అధ్యయనం సాయుధ సంఘర్షణల సమయంలో వన్యజీవులు ఎలా తక్షణం స్పందిస్తాయో నిజ సమయంలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. యుద్ధం మానవులను మాత్రమే కాకుండా ప్రకృతిని కూడా బాధిస్తుందని, జంతువులు మానవులను ముప్పుగా భావించి ప్రవర్తన మార్చుకుంటాయని తెలిసింది. ఈ ఫలితాలు ప్రపంచంలోనే మొదటిసారి యుద్ధ ప్రభావాన్ని కెమెరా డేటా ద్వారా రుజువు చేశాయి.
