కలియుగంలో మనిషి డబ్బుకు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు.. డబ్బు సంపాదనలో పడి సొంత ఫ్యామిలీని కూడా మనిషి పట్టించుకున్న పాపానా లేడు. స్నేహితులు.. బంధువులందరినీ కూడా డబ్బుతో ముడిపెట్టి చూస్తుంటాడు.. ప్రస్తుత రోజుల్లో జేబులో ఉన్న రూపాయిని దానం చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు కొందరు.. అయితే ఓ పెద్దాయన మాత్రం ఏకంగా తనకు చెందిన యావదాస్థిని దానంచేసి అందరిచేత నీరాజనాలు అందుకున్నాడు. ఆయన దానం చేసిన ఆస్తి విలువ తెలుసుకొని ప్రతీఒక్కరూ అవాక్కయిపోతున్నారు. అతడిని కలియుగ దానకర్ణుడిగా కీర్తిస్తున్నారు.
Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నిక.. ఇండియన్ అమెరికన్లు ఎటువైపు?
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో చార్లెస్ చుక్ ఫినీ నివాసం ఉంటున్నాడు. డ్యూటీ ఫ్రీ షావర్స్ సహా వ్యవస్థాకుడిగా చుక్ ఫినీ ఉన్నారు. ఇటీవలే ఆయన పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా తనకు చెందిన యావదాస్తిని అట్లాంటిక్ ఫిలాంత్రోపీస్ అనే స్వచ్చంధ సంస్థకు దానం చేశారు. ఈ ఆస్తి విలువ రూ.58వేల కోట్లు. ఎనిమిదేళ్ల క్రితమే ఆయన పదవీ విరమణ తర్వాత తన యావదాస్తిని దానం చేయనున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారమే చుక్ ఫినీ తన ఆస్థినంతటిని దానం చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశారు.
ప్రపంచంలో కుబేరుల్లో చార్లెస్ చుక్ ఫినీ ఒకరు. వేల కోట్లను సంపాదించిన ఆయన ఈనెల 14న పదవీ విరమణ చేశారు. తన భార్యతో కలిసి జీవించేందుకు కేవలం తన వద్ద రూ.14కోట్లను ఉంచుకొని మిగతా ఆస్థినంతటినీ వివిధ స్వచ్చంధ సంస్థలకు ఆయన దానం చేశారు. ఈ మాజీ కుబేరుడు ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక మామూలు అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. తన భార్యతో కలిసి తన విశ్రాంత జీవితాన్ని ఓ మధ్య తరగతి వ్యక్తి జీవించేందుకు సిద్ధమయ్యాడు.
Also Read: సిరియా అధ్యక్షుడిని చంపిద్దామనుకున్న… ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఆయన పదవీ విరమణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 14న ఫీనీ స్వచ్ఛంద సంస్థతో తన ప్రయాణం ముగిసింది.. ‘చాలా నేర్చుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నేను బతికుండగానే ఈ మంచి పని పూర్తి కావడం నాకు బాగా అనిపిస్తోంది’ అంటూ ఆయన ఫోర్బ్స్ పత్రికతో వ్యాఖ్యానించారు. దీనిపై బిల్ గేట్స్.. వారెన్ బఫెట్ మాట్లాడుతూ తాము దాతృత్వాన్ని చాటుకోవడం వెనుక స్ఫూర్తి ఫీనీయే కారణమని పేర్కొన్నారు. ఛార్లెస్ చుక్ ఫినీ డబ్బు సంపాదనలో కంటే ధాతృత్వంలో ఆనందాన్ని వెతుక్కోవడాన్ని ప్రతీఒక్కరు స్వాగతిస్తున్నారు. ఆయన సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.