Center Point Of The Earth: విశాల ప్రపంచంలో అద్భుతాలకు కొదువ లేదు. భూభాగాలు, పర్వత శిఖరాలు, సముద్ర మట్టం వంటి ఎన్నో ఆశ్చర్యకరమైనవి ఉన్నాయి. ఇక ఈ భూమిని కేంద్రంగా చేసుకొని ఎన్నో పరిశోధనలు కూడా చేస్తున్నారు. కొన్ని అంచనాలకు అందేవి అయితే మరికొన్ని అందనివి. పోటీ పరీక్షల్లో కూడా భూమికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. మరి ఇందులో భాగంగానే భూమి మధ్యలో ఏ దేశం ఉందో మీకు తెలుసా?
భూమి గోళాకారంగా ఉందా? చదునుగా ఉందా అని ఎన్నో పరిశోధనలు చేస్తే చివరకు గోళాకారంగా ఉందని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అయితే భూమి మధ్యలో ఉండే దేశం పేరు ఏంటి అనే ప్రశ్నకు కూడా సమాధానం కనుగొన్నారు. ఈ దేశం పేరు ఘనా. దీన్ని ఊహాజనిత ప్రదేశంగా పేర్కొంటారు. అంతే వివరంగా చెప్పాలంటే.. భూమి మధ్యలో దేశం లేకపోతే ఘనాను భూమికి కేంద్రం అంటారు. మరి ఈ ఘనాను కేంద్రం అని ఎందుకు అంటారు అనే ప్రశ్న కూడా తలెత్తిందట. అది కూడా తెలుసుకోండి.
ఘనా భూమికి మధ్యలో ఉన్న ఆఫ్రికా దేశం. దీన్ని భూమికి కేంద్రంగా పరిగణిస్తారట. ఇక్కడి నుంచే భూమి వెడల్పులను కొలుస్తారు కూడా. ఘనా భూమి మధ్య నుంచి 380 మైళ్ల దూరంలో ఉంటుంది. ఇది భూమి మధ్యలో చాలా దగ్గరగా ఉన్నందుకు దీన్ని భూమి కోర్ అంటున్నారు. భూమికి మధ్యలో ఉండడం వల్ల ఇక్కడ వాతావరణం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ అత్యధిక వేడి ఉంటుందని తెలుస్తోంది. మే, జూన్ లలో బయటకు వెళితే మంటల్లో కాల్చినట్టుగా ఉంటుందట.
ఈ దేశం చుట్టు బంగారు గనులు ఉండేవట. దీంతో చాలా సంపన్న దేశంగా పేరు సంపాదించింది. ఇక్కడ ఉన్న బంగారాన్ని ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయవచ్చని కూడా అంటారు. దీన్ని స్వాధీనం చేసుకోవడానికి పోర్చుగీస్, బ్రిటీషర్ల మధ్య ఎన్నో యుద్దాలు కూడా జరిగాయట. అయితే ఇక్కడ ప్రజల జీవన విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోనే మానవులు కట్టిన అతిపెద్ద సరస్సు, వోల్టా ఉంది.