Canada Vs India: సిక్కు వేర్పాటు వాది.. ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ 2023లో కెనడాలో హత్యకు గురయ్యాడు. అతని హత్య వెనుక భారత హై కమిషన్ ప్రతినిధుల హస్తం ఉందని ఆరోపిస్తోంది. గతేడాదే కెనడా ప్రధాని భారత్‌పై ఆరోపణలు చేశారు. దీంతో స్పందించిన భారత్ ఆధారాలు ఇవ్వాలని సూచించింది. కానీ, ఏడాది గడిచినా ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో కెనడాలో 12 శాతం ఉన్న సిక్కుల ఓట్లు పొందేందుకు మరోమారు ఆరోపణలు చేశారు. దీంతో స్పందించిన భారత్.. కెనడాలోని భారత రాయబారులను వెనక్కు రప్పించింది. భారత్‌లోని కెనడా రాయబారులను బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా హత్యకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద లేవని కూడా తెలిపారు ట్రూడో.
హోం మంత్రిపై ఆరోపణలు..
ఇదిలా ఉండగా తాజాగా భారత హోం మంత్రి అమిత్‌షాపై కెనడా సంచలన ఆరోపణలు చేసింది. కెనడాలో ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలకు అమిత్‌షా అనుమతి ఇచ్చారని కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి నటాలియా డ్రాయిన్ ఆరోపించారు. దీంతో రెండు దేశాల మధ్య మరోసారి రాజకీయం వేడెక్కింది. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ అధికారుల హస్తం ఉందని పేర్కొన్నారు. నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు విషయాలను తాము కావాలనే వాషింగ్‌టన్ పోస్ట్‌కు లీక్ చేసినట్లు అంగీకరించారు. ఇందుకు ప్రధాని ట్రూడో అనుమతి కూడా అవసరం లేదని తెలిపారు.
సీక్రెట్ కాదు..
ఇదిలా ఉంటే.. అక్టోబర్ 14వ తేదీకి ముదు తాము వాషింగ్‌టన్ పోస్టు పత్రికకు వెల్లడించిన సమాచారం సీక్రెట్ కాదని నటాలియా వెల్లడించారు. భారత్‌తో సహకారానికి తాము తీసుకున్న చర్యలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపింది. కెనడా వాసులపై జరుగుతున్న దాడులకు సంబంధిత ఆధారాలను న్యూఢిల్లీకి పంపినట్లు కూడా తెలిపారు.
ఇంతలా దిగజారాలా..
ఎన్నికల కోసం ట్రూడో చేస్తున్న ప్రయత్నాలు ఆయనకు ఏమాత్రం లాభం చేకూర్చవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెడనాలోని సిక్కులు భారతీయులు. తమ మాతృభూమిపై ఆ దేశ ప్రధాని చేస్తున్న ఆరోపణలను బహిరంగంగా, భద్రత నేపథ్యంలో ఖండించకపోయినా.. ఎన్నికల సమయంలో ఓటు ద్వారా స్పష్టత ఇస్తారు. కొంత మంది ట్రూడోకు అనుకూలంగా ఓటు వేసినా మెజారిటీ భారతీయ కెనడా పౌరులు భారత్‌కు అనుకూలంగానే ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Canada has made sensational allegations against indian home minister amit shah
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com