Britain Exit Polls: బ్రిటన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌.. రిషి సునాక్‌కు షాక్‌!

బ్రిట్‌ పార్లమెంటులో 650 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ 326. ప్రస్తుతం కన్జర్వేటివ్‌ పార్టీ 14 ఏళ్లుగా బ్రిట్‌లో అధికారంలో ఉంది.

Written By: Raj Shekar, Updated On : July 5, 2024 9:55 am

Britain Exit Polls

Follow us on

Britain Exit Polls: బ్రిటన్‌ ప్లామెంటు ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. భారత కాలమానం ప్రకారం గురువారం(జూన్‌4) ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. పూర్తిగా బ్యాలెట్‌ పద్ధతిలో ఈ పోలింగ నిర్వహించారు. పోలింగ్‌ అనంతరం ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డాయి. ప్రధాని రిషి సునాక్‌కు ఇవి షాక్‌ ఇచ్చారు. ఈ ఎన్నికలు అదికార కన్జర్వేటివ్‌ పార్టీకి భారీ ఓటమి తప్పదని అన్ని సర్వే సంస్థలు తేల్చాయి. ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని వెల్లడించాయి. ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుగుణంగానే ఫలితాలు వెలువడుతున్నాయి. శుక్రవారం(జూన్‌ 5) ఉదయం 11 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

మేజిక్‌ ఫిగర్‌ 326..
బ్రిట్‌ పార్లమెంటులో 650 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ 326. ప్రస్తుతం కన్జర్వేటివ్‌ పార్టీ 14 ఏళ్లుగా బ్రిట్‌లో అధికారంలో ఉంది. భారతీయ మూలాలు ఉన్న ప్రధానమంత్రి రిషి సునాక్‌ సారథ్యంలో ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లింది. 2019 ఎన్నికల్లో ఈ పార్టీకి 344 సీట్లు సాధించింది. లేబర్‌ పార్టీ 205 స్థానాలకే పరిమితమై ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. ఇక స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ– 43, లిబరల్‌ డెమొక్రాట్స్‌– 15, డెమొక్రటిక్‌ యూనియనిస్ట్‌ పార్టీ– 7, సిన్‌ ఫెయిన్‌ – 7 సీట్లు ఉన్నాయి.

ఫలితాలు తారుమారు..
తాజాగా జరిగిన ఎన్నికల్లో ఫలితాలు తారుమారవుతున్నాయి. ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు లేబర్‌ పార్టీ 81, కన్జర్వేటివ్‌ పార్టీ 7 సీట్లు గెలిచాయి. దీంతో కన్జర్వేటివ్‌ పార్టీకి ఘోర ఓటమి తప్పదని అర్థమవుతోంది. విచిత్రం ఏమిటంటే మరో ప్రతిపక్‌ పార్టీ లిబరల్‌ డెమోక్రాట్లు 8 స్థానాలను గెలచుకున్నారు. అధికార పార్టీ ప్రస్తుతం మూడోస్థానానికి పరిమితమైంది. ఇక ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల ప్రకారం లేబర్‌ పార్టీ 410 స్థానాలు సాధించే అవకాశం ఉంది. ఇక అధికార కన్జర్వేటివ్‌ పార్టీ కేవలం 131 సీట్లకు పరిమితమవుతుందని తేల్చాయి. ఫలితాలు కూడా అదేవిధంగా వస్తున్నాయి. సండర్‌ల్యాండ్‌ సౌత్‌లో తొలి విజయాన్ని అందుకుంది లేబర్‌ పార్టీ. ఆ పార్టీ అభ్యర్థి సర్‌ కీర్‌ స్టార్మర్‌ ఘన విజయం సాధించారు. లేబర్‌ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఈయనే.