Kalki 2898 Ad Collection: కల్కి మూవీ బాహుబలి 2, త్రిబుల్ ఆర్ సినిమాలా ఫస్ట్ డే రికార్డ్ ను బ్రేక్ చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

ఇండియన్ సినిమాల్లో మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో త్రిబుల్ ఆర్ సినిమా మొదటి ప్లేస్ లో ఉంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు 223 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక దాని తర్వాత ప్లేస్ లో బాహుబలి 212 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక మూడో ప్లేసులో కల్కి సినిమా ఉంది.

Written By: Gopi, Updated On : July 5, 2024 10:13 am

Kalki 2898 Ad Collection

Follow us on

Kalki 2898 Ad Collection: ఇండియాలో ప్రస్తుతం సినిమాల క్యాలిక్యులేషన్స్ మారిపోయాయి. ఎంత పెద్ద సినిమా అయిన కూడా ఒక వారం రోజుల్లోపే భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి. ఒకప్పుడు సినిమాలు 100 రోజులు, 365 రోజులు ఆడేవి. కానీ ఇప్పుడు వారం రోజుల్లోపే ఆ సినిమా రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. ఇక ఆ సినిమా వారం లో ఎలాంటి కలెక్షన్లను అయితే సాధిస్తుందో అవే ఫైనల్ అవుతున్నాయి.

వారం తర్వాత నుంచి సినిమాలన్నీ సైడ్ అయిపోతున్నాయి. ఇక అందులో భాగంగానే ఇక సినిమా మొదటి రోజు ఎన్ని వసూళ్లను కలెక్ట్ చేస్తుంది అనే దాని మీద భారీ రికార్డులు కూడా క్రియేట్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఇండియన్ సినిమాల్లో మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో త్రిబుల్ ఆర్ సినిమా మొదటి ప్లేస్ లో ఉంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు 223 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక దాని తర్వాత ప్లేస్ లో బాహుబలి 212 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక మూడో ప్లేసులో కల్కి సినిమా ఉంది.

ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మొదటి రోజు 191 కోట్ల వసూళ్లను రాబట్టడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఈ సినిమా బాహుబలి 2, త్రిబుల్ ఆర్ సినిమాల మొదటి రోజు రికార్డులను ఈజీగా బ్రేక్ చేసేది. కానీ ఈ సినిమాకి మొదటిరోజు నైట్ ఒంటి గంటకు వేయాల్సిన బెనిఫిట్ షోస్ వేయలేదు. దానివల్లే ఈ సినిమా కలెక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గాయనే చెప్పాలి. అలా వెయ్యకపోవడానికి కారణం ఏంటంటే నైట్ ఒంటి గంటకు సినిమా అంటే చాలామంది తాగేసి సినిమా థియేటర్ కి వచ్చి అల్లరి అల్లరి చేస్తున్నారట.

ముఖ్యంగా ఆ టైంలో సినిమా చూసే లేడీస్ కి చాలా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఆ షోస్ ని క్యాన్సల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ షోస్ కనక పడినట్టైతే ఈ సినిమా కూడా భారీ రికార్డులను క్రియేట్ చేసేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…