Homeఅంతర్జాతీయంMaryam Nawaz Daughter Wedding: పాకిస్తాన్‌ పెళ్లిలో మార్మోగిన బాలీవుడ్‌ పాటలు.. హిజాబ్‌ గిజాబ్‌ జాన్తా...

Maryam Nawaz Daughter Wedding: పాకిస్తాన్‌ పెళ్లిలో మార్మోగిన బాలీవుడ్‌ పాటలు.. హిజాబ్‌ గిజాబ్‌ జాన్తా నై!

Maryam Nawaz Daughter Wedding: పాకిస్తాన్‌ ఇస్లామిక్‌ దేశం. అక్కడి చట్టాలు కఠినంగా ఉంటాయని, మత ప్రాతిపదికన ఉంటాయని అంటారు. ముఖ్యంగా మతానికి ఇబ్బంది కలుగకుండా అందరూ కట్టుబడి ఉంటారని భావిస్తారు. మతానికి వ్యతిరేకంగా ఏ పని చేసిన కఠిన చర్యలు తీసుకుంటారని ప్రచారం. కానీ, ఇటీవల పంజాబ్‌ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌ కుమార్తె వివాహంలో ఇస్లాం నిబంధనలన్నీ ఉల్లంఘించారు. పెళ్లిని ఏకంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. నవాజ్‌ షరీఫ్‌ కుటుంబ సభ్యురాలైన మరియం కుమార్తె వివాహం ప్రత్యేక అంశాలతో కదిలించింది. షెహబాజ్‌ షరీఫ్‌ సోదరుడు నవాజ్‌ కుటుంబం ఈ ఆచారాన్ని పాటించడం గమనార్హం.

హిజాబ్‌ లేకుండా, టోపీలు ధరించకుండా..
వివాహంలో మహిళలు హిజాబ్‌ ధరించలేదు. పురుషులు ఇస్లామిక్‌ టోపీలు ధరించలేదు. ఈ స్వేచ్ఛా ఆచారాలు సాంప్రదాయక నిబంధనలకు విరుద్ధంగా నిలిచాయి. ఇక ఈ పెళ్లి దుస్తులు భారతీయ ఫ్యాషన్‌ డిజైనర్‌ రూపొందించాడు. బద్ధ శత్రుత్వం ఉన్న దేశానికి చెందినవాడిని ఎంపిక చేయడం ఆశ్చర్యకరం. సంగీత్‌ కార్యక్రమంలో అందరూ నృత్యం చేశారు. ఇస్లాం నియమాలకు విరుద్ధమైన ఈ ఆచారాన్ని అనుమతించారు.

మార్మోగిన బాలీవుడ్‌ పాటలు..
వివాహంలో బాలీవుడ్‌ హిట్‌ పాటలకు అందరూ డ్యాన్స్‌ చేశారు. దురంధర్‌ పాటలకు స్టెప్పులేశారు. భారతీయ సంగీతం ఎంపిక చేసుకున్నా.. ముస్లిం సంస్థలు ఫత్వాలు జారీ చేయలేదు. మన దేశంలో అయితే చిన్న విషయాలను కూడా బూతద్దంలో పెట్టి చూస్తారు. పాకిస్తాన్‌లో పెద్ద విషయాలను కూడా పట్టించుకోలేదు.

షరీఫ్‌ కుటుంబం ఆచారాల్లో మార్పు తీసుకువచ్చింది. భారతీయ ప్రభావం, స్వేచ్ఛా జీవనశైలి ప్రదర్శన రాజకీయ ఇమేజ్‌ మార్పుకు దారితీస్తుంది. పాక్‌ సంస్థల మౌనం సంపన్నులకే పరిమితామా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version