spot_img
Homeఅంతర్జాతీయంPM Modi: మోదీ రష్యా పర్యటన వెనుక భారీ వ్యూహం.. మాస్కోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన...

PM Modi: మోదీ రష్యా పర్యటన వెనుక భారీ వ్యూహం.. మాస్కోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని!

PM Modi: రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతున్న వేళ.. భారత ప్రధాని మోదీ రష్యా పర్యటనపై సర్వత్రా ఆసక్తి చేపుతోంది. వ్యూహాత్మకంగానే మోదీ ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. ఒకవైపు అమెరికా – రష్యా మధ్య వైరం కొనసాగుతుంది. రష్యాపై అమెరికా అనేక ఆంక్షలు విధించింది. అయినా ప్రధాని మోదీ రెండు రోజుల రష్యా పర్యటనకు సోమవారం(జూలై 8న) వెళ్లారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ రెండో విదేశీ పర్యటన ఇదీ. మొదటి రోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ.. రెండో రోజు మంగళవారం(జూన్‌ 9న) ఆదేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌తో యుద్ధంతోపాటు పలు అంశాలపై చర్చించారు. రష్యా సైన్యంలో ఇరుక్కుపోయిన భారతీయులను స్వదేశానికి పంపించాలని మోదీ కోరారు. ఇందుకు పుతిన్‌ సానుకూలంగా స్పందించారు.

శుత్రదేశాల్లో వణుకు…
మోదీ రష్యా పర్యటన శత్రు దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. మోదీ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకోవడంతోపాటు సైనిక సహయారం, ఆయుధాల కొనుగోళ్లు, రక్షణ సహకారం తదితర అంశాలపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌ పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్‌కు పరోక్షంగా హెచ్చరిక పంపినట్లు భావిస్తున్నారు. శత్రుదేశాలపై త్రిశూల వ్యూహం అమలులో భాగంగానే మోదీ రష్యా పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది.

భారతీయులతో సమావేశం..
ఇక రష్యా పర్యటన ముగించుకుని ఆస్ట్రియా బయల్దేరే ముంద మోదీ రష్యాలోని భారతీయులతో సమావేశమయ్యారు. మాసోకకలోని డయాస్పోరా వేదికగా భారతీయుల్ని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

140 కోట్ల మంది ప్రేమతో..
తాను రష్యాకు ఒంటరిగా రాలేదని, 140 కోట్ల మంది భారతీయుల ప్రేమతో ఇక్కడికి వచ్చానని తెలిపారు. భారత్‌ జీ–20 సదస్సును విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు. డిజిటల్‌ పేమెంట్లలో సరికొత్త రికార్డు సృష్టించామన్నారు. దేశం మారుతోందని, ప్రపంచం మొత్తం గుర్తిస్తోందని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మించామని చెప్పారు. పదేళ్లలో 30 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు ఎలక్ట్రిఫికేషన్‌ పూర్తి చేశామని తెలిపారు. పదేళ్లలో ఎయిర్‌పోర్టుల సంఖ్య రెట్టింపు చేశామని పేర్కొన్నారు.

ఇది ట్రైలర్‌ మాత్రమే..
ఇక పదేళ్లలో జరిగిన అభివృద్ధి వెనుక 140 కోట్ల మంది భారతీయుల కృషి ఉందని తెలిపారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే అని పేర్కొన్నారు. సవాళ్లు తన డీఎన్‌ఏలోనే ఉన్నాయని చెప్పారు. ఐదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధి చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయిందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్‌ 15 శాతం సహకరిస్తోందని తెలిపారు. ప్రతీ భారతీయుడు దేశాన్ని మార్చేందుఉ తీవ్రంగా శ్రమిస్తున్నాడని తెలిపారు. భారత దేశ విజయాలపై ఎన్నారైలు గర్వంగా మాట్లాతున్నారని చెప్పారు భారత్‌ చంద్రయాన్‌తో చంద్రునిపైకి చేరిందన్నారు. మరే దేశం ఆ స్థాయికి చేరుకోలేదని తెలిపారు.

మూడో అతిపెద్ద స్టార్టప్‌..
ఇక భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ధ స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ కలిగి ఉందని తెలిపారు. డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ అగ్రగామిగా కొనసాగుతున్నట్లు చెప్పారు. భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో లక్ష్యాన్ని చేరుకుంటామని మోదీ తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular