Donald Trump: ఈసారి జరిగే ఎన్నికల్లో గెలిచి మరోసారి అమెరికా అధ్యక్షుడు కావాలని డోనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసుకుంటున్నారు. అప్పట్లో పెద్దల చిత్రాల్లో నటించే ఓ నటి మణితో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వినిపించాయి. ఆ సంఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.. ఆ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది.. అది మర్చిపోకముందే బ్యాంకులను మోసం చేశారని.. అడ్డగోలుగా రుణాలు తీసుకున్నారని అప్పట్లో ట్రంప్ పై ఆరోపణలు వినిపించాయి. ఆయనకు న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తే బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ లోగానే భారత సంతతికి చెందిన రామస్వామి తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోవనని ప్రకటించిన నేపథ్యంలో.. ట్రంప్ అధ్యక్ష పదవి కోసం మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ మీద విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ పరిణామం డోనాల్డ్ ట్రంప్ ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఇది ఒక రకంగా ట్రంప్ కు ఇబ్బందికరమైన వార్తే.
బ్యాంకు రుణాల కోసం డోనాల్డ్ ట్రంప్ తప్పుడు పత్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ న్యాయమూర్తి ట్రంప్ కు భారీగా జరిమానా విధించారు. ఏకంగా 355 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించారు. 355 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో 2,900 కోట్లు. బ్యాంకులను ట్రంప్ మోసం చేసిన కేసులో న్యూయార్క్ జడ్జి ఈ తీర్పును వెలువరించారు. అంతేకాదు ఈ తీర్పుతోపాటు ట్రంప్ న్యూయార్క్ కార్పొరేషన్ కు ఆఫీసర్ లేదా డైరెక్టర్ గా మూడు సంవత్సరాలు పాటు ఉండకూడదని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
తనకు ఉన్న ఆస్తులు విషయంలో ట్రంప్ అబద్ధాలు చెప్పినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన ఆస్తుల విలువను అమాంతం పెంచి, బ్యాంకులకు తప్పుడు పత్రాలు సమర్పించి రుణాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తన తీర్పుతో మూడేళ్ల పాటు ట్రంప్ మళ్లీ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు అవకాశం ఉండదని న్యూయార్క్ జడ్జి ఆర్డర్ ఎం గోరన్ ప్రకటించారు. అయితే ఈ తీర్పు పట్ల తాను అంత ఆనందంగా లేనని, పై కోర్టుకు అప్పీల్ చేస్తానని ట్రంప్ ప్రకటించారు. గత ఏడాది మధ్యకాలం నుంచి ట్రంప్ ఏదో వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు.