https://oktelugu.com/

Deepika Padukone  : దీపికా పదుకొనే మొదటి బిడ్డకు జన్మని ఇచ్చే తేదీ ఖరారు..పెళ్లి రోజుకి అతి దగ్గరగా..ఫ్యాన్స్ కి పండగే!

దీపికా పదుకొనే గత కొంతకాలం క్రితమే గర్భం దాల్చిన సంగతి అందరికి తెలిసిందే. 'కల్కి' సినిమా ప్రొమోషన్స్ లో కూడా ఆమె బేబీ బంప్ తోనే కనిపించింది. ఆ సినిమా మొత్తం కూడా ఆమె బేబీ బంప్ తోనే కనిపించేది. ప్రొమోషన్స్ లో కూడా అలాగే రావడంతో, అందరూ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అలా వచ్చిందని అనుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 1, 2024 / 03:55 PM IST

    Deepika Padukone Baby

    Follow us on

    Deepika Padukone  :  ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో మన అందరికి ముందుగా గుర్తు వచ్చే జంట రణవీర్ సింగ్ – దీపికా పదుకొనే. సుమారుగా నాలుగేళ్ళ పాటు ప్రేమించుకున్న ఈ జంట 2018 నవంబర్ 14 వ తేదీన పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరి పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినీ పరిశ్రమకి చెందిన వారితో పాటు, రాజకీయ నాయకులు కూడా ఈ వివాహ వేడుకకు విచ్చేసారు. వారిలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కూడా ఉండడం గమనార్హం. పెళ్లి జరిగిన ఏడాదికే విడిపోతున్న సెలెబ్రిటీలు ఉన్నటువంటి ఈరోజుల్లో, పెళ్లి జరిగి నాలుగేళ్లు అవుతున్నా కూడా అదే తరహా ప్రేమాభిమానాలతో ఈ జంట కొనసాగుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిల్చింది.

    ఇదంతా పక్కన పెడితే దీపికా పదుకొనే గత కొంతకాలం క్రితమే గర్భం దాల్చిన సంగతి అందరికి తెలిసిందే. ‘కల్కి’ సినిమా ప్రొమోషన్స్ లో కూడా ఆమె బేబీ బంప్ తోనే కనిపించింది. ఆ సినిమా మొత్తం కూడా ఆమె బేబీ బంప్ తోనే కనిపించేది. ప్రొమోషన్స్ లో కూడా అలాగే రావడంతో, అందరూ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అలా వచ్చిందని అనుకున్నారు.కానీ నిజంగానే దీపికా తల్లి కాబోతుందని రీసెంట్ గానే అభిమానులకు కూడా క్లారిటీ వచ్చింది. ఈ నెల 28 వ తారీఖున ఆమె మగ/ ఆడ బిడ్డకి జన్మని ఇవ్వబోతుంది. ముంబై లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో ఆమె ప్రసవించబోతున్నట్టు తెలుస్తుంది. సరిగ్గా వీళ్లిద్దరి పెళ్లి రోజుకి నెల రోజుల ముందు ఈ బిడ్డ జనమించబోతుండడం విశేషం. చూసేందుకు ఎంతో అందంగా కనిపించే ఈ జంటకి పుట్టబోయే బిడ్డ, ఇంకెంత అందంగా ఉంటుందో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే సెలెబ్రిటీలు ఈమధ్య కాలం లో తమకి పుట్టిన బిడ్డల్ని మీడియా కి చూపించడం లేదు. దీపికా- రణవీర్ సింగ్ జంట కూడా అదే పద్దతిని అనుసరించబోతున్నారా అనేది చూడాలి.

    ఇక దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే ఈమె కల్కి చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. పెళ్ళైన తర్వాత చాలా మంది హీరోయిన్లు సినిమాలు మానేస్తుంటారు. కనీసం గర్భం దాల్చిన సమయంలోనైనా సినిమాలకు కాస్త విరామం ఇస్తుంటారు. కానీ దీపికా పదుకొనే మాత్రం అలా చెయ్యలేదు. పెళ్లి తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ, గర్భం దాల్చిన సమయంలో కూడా ఆమె పని చేసింది.ఇలా ఇప్పటి వరకు హిస్టరీ లో ఏ హీరోయిన్ కూడా చేసి ఉండదు. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగన్ తో ‘సింగం అగైన్’ అనే చిత్రం చేస్తుంది. ఇక రణవీర్ సింగ్ విషయానికి వస్తే ఈ ఏడాది ప్రారంభం లో ఆయన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని’ అనే చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ లో ‘డాన్ 3 ‘ చిత్రం చేస్తున్నాడు.