https://oktelugu.com/

Horoscope Today: ఆషాడం అమావాస్య వేళ.. ఈ రాశుల వారికి కలిసి రానుంది.. ఆర్థిక లాభాలు ఎక్కవే..

ఈ రాశి వారికి ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. చట్టపరమైన విషయాల్లో అనుకూల తీర్పులు ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రమోషన్ పొందుతారు. ఇతరుల సాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 4, 2024 / 07:39 AM IST
    Follow us on

    Horoscope Today: ద్వాదశ రాశులపై ఆదివారం పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. అలాగే ఆషాడం అమావాస్య సందర్భంగా రవి పుష్య యోగం, సిద్ధి యోగం ఏర్పడనున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    వివాహానికి సంబంధించిన ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని అదనపు బాధ్యతలు చేపడుతారు. వ్యాపారులకు ఇంటి పెద్దల సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రభుత్వ సొమ్ము పొందుతారు.

    వృషభ రాశి:
    కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకోని ధనం వస్తుంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదం చేస్తారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు పెట్టుబడులు పెడుతారు. వీరికి తండ్రి మద్దతు ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్ గురించి ఆందోళన చెందుతారు.

    మిథున రాశి:
    రాజకీయ రంగాల వారికి సమాజంలో గుర్తింపు వస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి. ఈ విషయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.

    కర్కాటక రాశి:
    ఈ రాశి వారికి ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. చట్టపరమైన విషయాల్లో అనుకూల తీర్పులు ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రమోషన్ పొందుతారు. ఇతరుల సాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు.

    సింహారాశి:
    కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు నేటితో ముగిసిపోతాయి. ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. చూట్టూ ఉన్న వ్యక్తుల గురించి అర్థం చేసుకోవాలి. ముఖ్యమైన పెట్టుబడుల విషయంలో తండ్రి మద్దతు ఉంటుంది. రుణం ఇచ్చేందుకు కొందరు ముందుకు వస్తారు.

    కన్య రాశి:
    ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. మహిళలు ఎక్కువగా పై అధికారులతో వాగ్వాదాలు చేయకుండా ఉండడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం.

    తుల రాశి:
    పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషనపై శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది.

    వృశ్చిక రాశి:
    ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు భాగస్వాములతో చిక్కులు ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో ఓపికతో వ్యవహరించాలి. జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయం ఇదే. కుటుంబంలోని కొన్ని బాధ్యతలు చేరపడుతారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.

    ధనస్సు రాశి:
    అమావాస్య ఈ రాశి వారికి అనుకూలంగా ఉండనుంది. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. వీరికి అధికారుల మద్దతు ఉంటుంది. ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని ప్రయాణాలు ఉంటాయి. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడుతారు. ముఖ్యమైన పనులపై నిర్ణయాలు తీసుకుంటారు.

    మకర రాశి:
    జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతతకు విలువ ఇస్తారు. డబ్బు ఇతరులకు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

    కుంభరాశి:
    రాజకీయ నాయకులు బిజీగా ఉంటారు. ఆదాయం పెరుగుతున్నా… ఖర్చులు తక్కువగా చేయాలి. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.

    మీనరాశి:
    సమాజంలో గౌరవం లబిస్తుంది. గత పెట్టుబడులకు సంబంధించి లాభాలు పొందుతారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి.