https://oktelugu.com/

Health Tips : గుండె పోటు నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.. జీవితంలో రాదు.. ఇలా చేయండి

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంటాయి. ఇది సిరలు లేదా ధమనులలో అడ్డంకును సృష్టిస్తాయి. దీని ప్రభావం గుండె నుంచి మెదడు వరకు ఉంటుంది అంటున్నారు నిపుణులు. సిరలు, ధమనులలో అడ్డుపడటం వలన గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్,వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 4, 2024 / 07:50 AM IST
    Follow us on

    Health Tips : ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుంటేనే దేశం బాగుంటుంది. చురుకుగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా గుండె పోటు సమస్య ఎక్కువ వస్తుంది. అందుకు నడక, యోగా, వ్యాయామం బాగా చేయాలి అంటున్నారు నిపుణులు. వీటితో పాటు మరికొన్ని అలవాట్లు చేసుకుంటే మీ గుండె ఆరోగ్యం పదిలం అవుతుంది. ఈ అలవాట్లలో ఒకటి మెట్లు ఎక్కడం మంచిది. ఏంటి మెట్లు ఎక్కడమా అనుకుంటున్నారా? మీరు సరిగ్గానే విన్నారు.. మెట్లు ఎక్కడం వల్ల కండరాలను బలోపేతం అవుతాయి. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. మరి ప్రతి రోజు ఎన్ని మెట్లు ఎక్కాలి అనేది కూడా ముఖ్యమే. అయితే ఈ మెట్లు ఎక్కడం వల్ల గుండె సిరలు బలంగా మారడం మారుతాయి అంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ 50 మెట్లు ఎక్కడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందట. మెట్లు ఎక్కే వారిని ఇతరులతో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువ ఉంది అంటున్నారు నిపుణులు. జిమ్‌కి వెళ్లడానికి లేదా ఎక్కువసేపు నడవడానికి సమయం లేకపోతే చింతించకుండా జస్ట్ మెట్లు ఎక్కితే సరిపోతుంది అని సూచిస్తున్నారు. కేవలం మెట్లు ఎక్కడం మాత్రమే కాదు గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే చాలా విషయాలను మనం గుర్తు పెట్టుకోవాలి. అవేంటంటే..

    అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంటాయి. ఇది సిరలు లేదా ధమనులలో అడ్డంకును సృష్టిస్తాయి. దీని ప్రభావం గుండె నుంచి మెదడు వరకు ఉంటుంది అంటున్నారు నిపుణులు. సిరలు, ధమనులలో అడ్డుపడటం వలన గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్,వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటిని నివారించాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. కొన్ని పండ్లు, పానీయాలతో కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీని ద్వారా గుండె సమస్యలను కూడా అదుపులో ఉంచుకోవచ్చు.

    జంక్ ఫుడ్ లేదా ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా తింటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. డ్రై ఫ్రూట్స్.. సిరలు, ధమనులలో అడ్డుపడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయట. కాబట్టి రోజువారీ ఆహారంలో పిస్తా, జీడిపప్పు, అంజీర పండ్లను చేర్చుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి. ఎండుద్రాక్షలో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి సిరలు, ధమనులలో అడ్డంకుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అందుకే వీటిని తినడం అలవాటు చేసుకోవాలి.

    కొలెస్ట్రాల్ ను స్ట్రాబెర్రీ కూడా తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. గుండె ఆగిపోకుండా ఉండటానికి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి స్ట్రాబెర్రీలను తినాలి అంటున్నారు నిపుణులు.

    గుండె ఆరోగ్యానికి కాపాడే ముఖ్యమైన పండ్లలో అవకాడో కూడా చోటు సంపాదించుకుంది. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అంటే మంచి కొలెస్ట్రాల్ ను అందిస్తూ చెడును తగ్గించే అవకాఢోను ఆహారంలో చేర్చుకోవాల్సిందే. దీని వల్ల మీరు గుండె సమస్యలు, గుండె పోటు వంటి ప్రమాదాల నుంచి బయటపడవచ్చు.

    లేవగానే టీ, కాఫీ లేనిది ఉదయం అవదు. ఇలా చాలా మంది టీ, కాఫీలకు అడెక్ట్ అయ్యారు. నిజానికి ఈ టీ, కాఫీలోని కెఫిన్ నరాలను ఉత్తేజపరుస్తుంటాయి. కానీ మరో మంచి విషయం ఏంటంటే.. సిరలు, ధమనులలో అడ్డుపడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయట ఈ టీ, కాఫీలు. ప్రతిరోజూ కాస్త టీ, కాఫీలు తాగడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది అన్నమాట. అయితే మంచిదని టీ, కాఫీలను ఎక్కువగా తీసుకోవద్దు. మరింత ఎక్కువ సమస్యలు వస్తాయి అని గుర్తుపెట్టుకోండి.