Homeఅంతర్జాతీయంDonald Trump: ట్రంప్‌పై పేలిన గన్‌ అదే.. దాని ప్రత్యేకత తెలుసా?

Donald Trump: ట్రంప్‌పై పేలిన గన్‌ అదే.. దాని ప్రత్యేకత తెలుసా?

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు, ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై పెన్సిల్వేనియాలో ఆదివారం (జూలై 14) కాల్పులు జరిగిన విషయం తెలిసింది. ఆయన ఈ ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఏడాది చివరన అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నవేళ జరిగిన ఈ ఘటనతో అమెరికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగరతోంది. మరోవైపు ఈ ఘటనపై అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ చేస్తోంది.

ఏఆర్‌ – 15తో కాల్పులు..
డొనాల్డ్‌ ట్రంప్‌ లక్ష్యంగా పేలిన తూటా అత్యాధునిక ఏఆర్‌–15 రైఫిల్‌గా ఎఫ్‌బీఐ గుర్తించింది. దీంతో ఇప్పుడు ఈ రైఫిల్‌పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సామూహిక జన హనన ఆయుధంగా దీనికి పేరుంది. తుపాకీ సంస్కృతిని నిలువెల్లా నింపుకున్న అమెరికా సమాజం పిస్తోలు వంటి చిన్న ఆయుధాలనే కాకుండా సైన్యంవాడే పెద్ద రైఫిళ్లనూ పోగేసుకోవడం వలన ఉత్పన్నమయ్యే దుష్పరిణాంమాలకు తాజా ఉదంతం అంద్దం పడుతోంది.

ఈ రైఫిల్‌ ప్రత్యేకత..
ఆర్మాలైట్‌(ఏఆర్‌–15) తుపాకీ.. మోడ్రన్‌ స్పోర్టింగ్‌ రైఫిల్‌(ఎంఎస్‌ఆర్‌) విభాగంలోకి వస్తుంది. ఇది సెమీ ఆటోమేటిక్‌ ఆయుధం. సైనిక అవసరాల కోసం తయారు చేసిన ఎం–16 రైఫిల్‌కు సంబంధించిన పౌర వెర్షన్‌ ఇది. సైనిక వెర్షన్‌ తరహాలో పూర్తి ఆటోమేటిక్‌ సౌకర్యం ఉంది. ఏఆర్‌–15ను ప్రధానంగా క్రీడల్లో, జంతువుల వేటలో ఉపయోగిస్తారు. కచ్చితత్వానికి ఇది పెట్టింది పేరు. ఇందులో నుంచి బయటకు వచ్చిన బుల్లెట్‌ టార్గెట్‌ను కచ్చితంగా రీచ్‌ అవుతుంది. అవసరం మేరకు ఈ రైఫిల్‌లో మార్పులు చేసుకోవచ్చు.

వేగంగా..
ఏఆర్‌ – 15 తుపాకీ నిమిషానికి 45 తూటాలను వదలగలదు. కొన్ని మారుపలతో ఇది నిమిషానికి 400 పైగా తూటాలను వదలగలదు వేగమే ఈ బుల్లట్‌ ప్రధాన బలం. సాధారణంగా ఏఆర్‌–15 లో పాయింట్‌ 223 క్యాలిబర్‌ తూటాను వాడతారు. ఇది చాలా తేలికగా ఉంటుంది. వేగంగా దూసుకుపోతుంది.

తూటాల ప్రత్యేకత..
ఇక పాయింట్‌ 223 తూటాలో వెనుక ఉండే క్యాట్రిడ్జ్‌ భాగం చాలా పెద్దగా ఉంటుంది. ముందువైపు ఉండే ప్రొపెల్లెంట్‌ అందులో ఉంటుంది. సాధారణంగా హ్యాండ్‌ గన్స్‌లో 9 ఎంఎం తూటాలు వాడుతుంటారు. దీని బుల్లెట్లు పెద్దగా, క్యాట్రిడ్జ్‌ భాగం చిన్నగా ఉంటుంది. అందుకే ఎక్కువ ప్రొపెల్లెంట్‌ పట్టదు. ఏఆర్‌–15 తూటా సెకనుకు కిలోమీటర్‌ దూరం దూసుకెళ్లగలదు. ఇది ఆధునిక హ్యాండ్‌గన్‌ తూటా వేగానికి మూడు రెట్లు అధికం. తూటాల అర ఖాళీ అయిన వెంటనే దాన్ని వేగంగా మార్చుకునే వెసులుబాటు ఏఆర్‌–15కు ఉంది.

మారణ మోహమే..
ఇక ఏఆర్‌–15 నుంచి బయటకు వచ్చిన బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్తే అక్కడికక్కడే ప్రనాణాలు పోతాయి. అయితే ఏఆర్‌–15 బుల్లెట్‌ చాలా ప్రమాదకరం. అది దూసుకొచ్చే వేగమే దీనికి ప్రధాన కారణం. ఇది శరీరాన్ని ఛిద్రం చేస్తుంది. వేగం క ఆరణంగా ఒంటో బ్లాస్ట్‌ ఎఫెక్ట్‌ తలెత్తుతుంది. ఫలితంగా తూటా తగిలిన చోటుకు దూరంగా ఉన్న భాగాల్లో అంతర్గత గాయాలు ఏర్పడుతాయి.

లోపలికి వెళ్లాక..
తూటా ఒంట్లోకి వెళ్లాక అవతలివైపు నుంచి బయటకు దూసుకెళ్లే సామర్థ్యం ఏఆర్‌–15 తూటాకు ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో రెండోవైపు పెద్ద గాయం చేస్తుంది. అధిక రక్తస్రావం కలిగిస్తుంది. కపాలాన్ని, ఎమెకలను ఈ తూటా చిద్రం చేసయగలదు. కీలక అవయవాలను నాశనం చేయగలదు. ఫలితంగా బాధితుడి మనుగడ అవకాశాలు తగ్గుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రాణాలు హరించివేస్తుంది. అందుకే నరమేధ ఆయుధంగా దీనిని వాడతారు.

Exit mobile version