https://oktelugu.com/

Prabhas: కల్కి సూపర్ హిట్… నేను జీరో అంటూ ప్రభాస్ సంచలన కామెంట్స్, వైరల్ వీడియో

Prabhas: ప్రభాస్ అతిపెద్ద ప్రయోగానికి తెరలేపాడు. మైథాలజీ-సైన్స్ ఫిక్షన్ మిక్స్ చేసి కల్కి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కల్కి వరల్డ్ వైడ్ ఏకంగా రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. ఈ వారం విడుదలైన భారతీయుడు 2 నెగిటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో...

Written By:
  • S Reddy
  • , Updated On : July 15, 2024 / 02:00 PM IST

    Prabhas thanks fans

    Follow us on

    Prabhas: మీరు లేకపోతే నేను జీరో అంటూ ప్రభాస్ కామెంట్స్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. కల్కి సక్సెస్ నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు. ప్రభాస్ తో పాటు ఆయన ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. దానికి కారణం కల్కి భారీ విజయం అందుకుంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ అందుకున్న క్లీన్ హిట్ కల్కి 2829 AD . ప్రభాస్ ఒక దశలో వరుస పరాజయాలు అందుకున్నారు. బాహుబలి 2 అనంతరం విడుదలైన సాహో ఆశించిన స్థాయిలో ఆడలేదు. నార్త్ ఇండియాలో మాత్రం పర్లేదు అనిపించుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సాహో చిత్రానికి ఆదరణ దక్కలేదు.

    ఇక రాధే శ్యామ్ మరొక డిజాస్టర్ గా నిలిచింది. రాధే శ్యామ్ ప్రభాస్ కెరీర్లో అత్యధిక నష్టాలు మిగిల్చిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఎమోషనల్ లవ్ డ్రామా ప్రభాస్ ఇమేజ్ కి సెట్ కాలేదు. రాధే శ్యామ్ కథ, కథనాలు కూడా అంతగా మెప్పించలేకపోయాయి. ఆదిపురుష్ మూవీతో ముచ్చటగా మూడో ప్లాప్ నమోదు చేశాడు. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడు పాత్ర చేయడం విశేషం. పరాజయంతో పాటు అవమానాలు కూడా మూటగట్టుకున్నాడు.

    దర్శకుడు ఓం రౌత్ రామాయణం తెరకెక్కించిన తీరుకు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రధాన పాత్రలు లుక్స్, కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని హిందూవాదాలు నిరసన ప్రకటించారు. ఒక దశలో ఆదిపురుష్ విడుదల అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభాస్ గత చిత్రం సలార్ కొంత మేర పర్లేదు అనిపించుకుంది. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆ మూవీ నచ్చలేదు.

    ఈ క్రమంలో ప్రభాస్ అతిపెద్ద ప్రయోగానికి తెరలేపాడు. మైథాలజీ-సైన్స్ ఫిక్షన్ మిక్స్ చేసి కల్కి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కల్కి వరల్డ్ వైడ్ ఏకంగా రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. ఈ వారం విడుదలైన భారతీయుడు 2 నెగిటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో కల్కి వసూళ్లు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కల్కి రన్ ముగిసే నాటికి 1100 నుండి 1200 కోట్ల రూపాయలు రాబట్టవచ్చు.

    ఇంత పెద్ద విజయాన్ని కట్టబెట్టిన అభిమానులకు ప్రభాస్ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆయన ఒక వీడియో బైట్ విడుదల చేశారు. కల్కి మూవీతో నాకు హ్యూజ్ హిట్ ఇచ్చారు. అభిమానులకు పలుమార్లు థాంక్స్. ఇదంతా మీ వలనే. మీరు లేకపోతే నేను జీరో. నాగ్ అశ్విన్ ఐదేళ్ల కష్టం ఈ మూవీ. నిర్మాతలు అశ్వినీ దత్, ప్రియాంక, స్వప్న దత్ లకు కూడా నా కృతజ్ఞతలు అని… ప్రభాస్ ఆ వీడియోలో కామెంట్ చేశారు. ప్రభాస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

    కల్కి మూవీలో ప్రభాస్ భైరవ రోల్ చేశారు. భైరవ పాత్రను దర్శకుడు నెగిటివ్ షేడ్స్ తో డిజైన్ చేయడం విశేషం. ఎప్పుడూ తన సుఖమే కోరుకునే స్వార్థపరుడిగా భైరవ పాత్ర సాగుతుంది. భైరవ పాత్రకు ధీటైన రోల్ అమితాబ్ చేయడం విశేషం. చెప్పాలంటే ప్రభాస్ ని కూడా అమితాబ్ రోల్ డామినేట్ చేస్తుంది. అంత పవర్ఫుల్ రోల్ అమితాబ్ దక్కించుకున్నారు. భైరవ-అశ్వద్ధామ కాంబోలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్.

    దీపికా పదుకొనె సైతం ఒక బలమైన ఎమోషనల్ రోల్ చేసింది. కమల్ హాసన్ కనిపించింది రెండు మూడు సన్నివేశాల్లోనే అయినా… ప్రభావం చూపాడు. కల్కి 2లో కమల్ హాసన్ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. రాజేంద్రప్రసాద్, శోభన, పశుపతి, బ్రహ్మానందం ఇతర కీలక రోల్స్ చేశారు.