Skin Health: అందానికి అమ్మాయిలు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందరిలో అందంగా కనిపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా చర్మం కాంతివంతంగా మెరవడానికి ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటంతో పాటు చిన్న చిన్న సహజ చిట్కాలు కూడా పాటిస్తుంటారు. అయితే చలికాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న చర్మం దెబ్బతింటుంది. ఏ సీజన్‌లో అయిన చర్మానికి కేర్ చూపించకపోయిన చలికాలంలో అయితే తప్పకుండా కేర్ చూపించాలి. చలికాలంలో చర్మ విషయంలో తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. లేకపోతే చర్మం పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అసలే చలికాలం ప్రారంభమైంది. చర్మంపై పగుళ్లు, తెలుపు వంటివి కనిపిస్తుంటాయి. అయితే ఈ కాలంలో కూడా చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తూ.. ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్లో దొరికే క్రీంలు కొందరు మాయిశ్చరైజర్‌గా వాడుతుంటారు. వీటిని వాడటం వల్ల ఆ నిమిషానికి చర్మం బానే ఉంటుంది. కానీ తర్వాత చర్మం అనారోగ్యానికి గురవుతుంది. చలికాలంలో చర్మం మంచిగా ఉండాలంటే ఇంట్లోనే సహజ చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలేంటి? ఎలా పాటిస్తే చర్మం పగుళ్లు రాకుండా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చలికాలంలో చర్మం అందంగా ఉండాలంటే రసాయనాలు ఉండే క్రీంలు కాకుండా కొబ్బరి నూనెను రాయడం మేలు. చర్మానికి కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల స్కిన్ కాంతివంతంగా ఉంటుంది. చర్మం పొడి బారకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయం స్నానం చేసే ముందు లేదా రాత్రి నిద్రపోయే ముందు చర్మానికి కొబ్బరి నూనెను అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. కొబ్బరి మాయిశ్చరైజర్‌గా బాగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. ఇవే కాకుండా ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనెలను కూడా చర్మానికి అప్లై చేయాలి. వీటిని అప్లై చేసిన కూడా చర్మం ఎలాంటి పగుళ్లు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. కాఫీ పౌడర్‌లో కొబ్బరి నూనె, కాస్త శనగపిండి వేసి ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను చర్మానికి అప్లై చేసి ఒక పది నిమిషాల తర్వాత ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడిగితే చర్మం మెరిసిపోతుంది. ఈ కాఫీ పౌడర్‌తో స్క్రబ్ కూడా తయారు చేసుకోవచ్చు. దీంతో ముఖాన్ని మర్దన చేయడం వల్ల చర్మం ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటుంది. ఈ కొబ్బరి నూనెలో కలబంద జెల్ కూడా కలపడం వల్ల స్కిన్ పొడిబారదు. చర్మం దెబ్బ తినకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేయడంలో బాగా ఉపయోగపడతాయి. చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఈ నియమాలు పాటించాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.