Americans : అమెరికాల ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 300లకుపైగా ఎలక్టోరల్ ఓట్లతో 51 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. ఇక డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 47 శాతం ఓట్లు సాధించారు. అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడంతో ఆయన అంటే నచ్చని మిగతా 45 శాతం మంది అమెరికన్లు ఇప్పుడు కొత్త గమ్యస్థానం వెతుక్కుంటున్నారు. తమ భవిష్యత్ గురించి ఆలోచిస్తూ.. అమెరికా విడిచి పోవడం ఎలా అని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, వలసవాదులపై నియంత్రణకు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉండడం, అంతర్జాతీయ సంబంధాల విషయంలోనూ విభిన్నంగా వ్యవహరించడం వంటి నిర్ణయాల నేపథ్యంలో చాలా మంది అమెరికన్లు ఇప్పుడు ‘మూవ్ టు’ అనే వాక్యాన్ని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.
ఆ దేశాల గురించి ఎక్కువ..
అమెరికాన్లు ఎక్కువగా కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు వెల్లడం ఎలా అని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారట. కెనడాకు వెళ్లిపోడం ఎలా అనే సెర్చ్ టర్మ్ వాఊ్యమ్ అమెరికాలో విపరీతంగా పెరిగిందట. ఓట్ల లెక్కింపు జరిగిన రోజు రాత్రి 400 శౠతం సెర్చ్ పెరిగినట్లు గూగుల్ ట్రెండ్స్ డేటా ద్వారా తెలుస్తోంది. కమలా హారిస్‌కు ఎక్కువగా మద్దతు ఇచ్చిన వాషింగ్‌టన్ వంటి స్టేట్స్‌లో ఈ ట్రెండ్స్ ఎక్కువగా ఉన్నాయట. కెనడాకు వెల్లాలంటే ఏం చేయాలి, యూఎస్ నుంచి కెనడాకు వెళ్లడం వంటి కీవర్డ్స్ సెర్చ్ బాగా పెరిగింది. కెనడా అమెరికా సరిహద్దునే ఉండడంతో ఆదేశం వెళ్లాలని చాలా మంది ఆలోచన చేస్తున్నారట. అక్కడ తమపై సానుభూతి ఉంటుందని, మానవ హక్కుల గౌరవం వంటి అంశాలు అమెరికన్లను ఆకర్షిస్తున్నాయి. ఈ కారణాలతో ఎక్కువ మంది కెనడా గురించే సెర్చ్ చేశారట.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా..
తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా గురించి కూడా అమెరికన్లు ఎక్కువగా సెర్చ్ చేశారని తెలుస్తోంది. ఈ దేశాల్లో అత్యుత్తమ జీవన ప్రమాణాలు, ఆరోగ్య సంరక్షణ, విద్యా సంస్థలు, సామాజిక న్యాయం, సాంస్కృతిక గౌరవం ఉన్నాయని అమెరికన్లు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అలాగే న్యూజిలాండ్ శాంతియుత దేశంగా గుర్తింపు ఉంది. ఈ కారణంతో ఈ రెండు దేశాలు కూడా అమెరికాను వీడాలనుకునేవారిని ఆకర్షిస్తున్నాయి. సాంకేతిక పరిణామాలు కూడా ఈ వలసలను మరింత సులభతరం చేశాయి. ఇంటర్నెట్, సులభమైన వీసా ప్ర్ర‘కియలు, దూరపు ఉద్యోగావకాశాలు, ఇతర దేశౠల్లో ఉద్యోగ అవకాశాల కోసం గూగుల్ సెర్చ్ వంటివి ఈ వలసల పెరుగుదల కలిగించాయి.
అమెరికా ప్రమాణాల ఆధారంగా..
ప్రస్తుతం అమెరికాలో ఉన్న జీవన ప్రమాణాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆరోగ్యం, సంప్రదాయాలు, సంస్కృతిని పరిగణనలోకి తీసుకుని అమెరికన్లు ఏ దేశం వెళ్లాలని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారని తెలుస్తోంది. తాము సుఖంగా జీవించేందుకు ఇతర దేశాలను పరిశీలిస్తున్నారు. ట్రంప్ విజయం ఒక రాజకీయ పరిణామంగా ప్రజల మనోభావాలను ప్రభావితం చేశాయి. దీంతో చాలా మంది దేశం వీడడమే మేలని అనుకుంటున్నారట.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Americans are searching on google how to reveal to canada new zealand and australia
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com