US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్‌కు షాక్‌ ఇచ్చిన సొంత పార్టీ ప్రతినిధులు!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో రెండ మూడు నెలల్లో జరుగనున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సమావేశాల్లో పాల్గొంటున్నారు.

Written By: Raj Shekar, Updated On : August 29, 2024 9:13 am

US Presidential Elections

Follow us on

US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో జరగడం ఖాయం. ఈమేరు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోవైపు ఓటరు నమోదు ప్రక్రియ తుది దశకు చేరింది. ఈ క్రమంలో అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. గడువు తక్కువగా ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార డెమోక్రటిక్, విపక్ష రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులు కమలాహారిస్, డొనాల్డ్‌ ట్రంప్‌లు ప్రచారంలో దూకుడుపెంచారు. ఇదే సమయంలో ప్రీపోల్‌ సర్వేలు కూడా జోరు పెంచాయి. మొన్నటి వరకు ఎన్నికల రేసులో ముందు ఉన్న ట్రంప్‌.. డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా బైడెన్‌ తప్పుకుని, కమలా హారిస్‌ రేసుకోకి వచ్చాక సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ట్రంప్‌ పైకి గెలుపు తనదే అని ప్రకటిస్తున్నా పరిశీలకులు మాత్రం ఫలితాలను అంచనా వేయడం కష్టంగా ఉందంటున్నారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌కు సొంత పార్టీ రిపబ్లికన్‌ పార్టీ నుంచి ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ.బుష్‌ హయాంలో ఆయనకు అనుకూలంగా పనిచేసిన సుమారు 200 మంది రిపబ్లికన్‌ పార్టీ మద్దతు దారులు డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు పలికారు. ఈ మేరకు బహిరంగంగా లేఖ రాశారు.

ట్రంప్‌పై వ్యతిరేకత..
అమెరికాలని ఫాక్స్‌ న్యూస్‌ కథనం ప్రకారం.. సొంత పార్టీ మద్దతు దారులే ట్రంప్‌ను వ్యతిరేకించారు. ఇదే తొలిసారి కూడా కాదు. అంతకుముందు 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ పోటీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జార్జ్‌ డబ్ల్యూ. బుష్‌తోపాటు ఆయన మద్దతు దారులు డొనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. తాజాగా మరోసారి ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్మానించారు. కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. ఈమేరకు రిపబ్లికన్‌ పార్టీకి నేతలు రాసిన బహిరంగ లేఖలో.. ట్రంప్‌ తిరిగి రెండోసారి ఎన్నుకుంటే దేశానికి విపత్తు అని తోటి రిపబ్లికన్లను హెచ్చరించారు.

ఒక్కటవుతున్న బుష్‌ మద్దతుదారులు..
ఇదిలా ఉంటే.. రాష్ట్రాలను బలోపేతం చేసేందుకు జార్జ్‌ హెచ్‌ డబ్ల్యూ. బుష్‌ మద్దతుదారలు ఒక్కటవుతున్నారు. ఈ ఏడాది నవంబర్‌ అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్‌ ఓట్లు వేస్తున్నామని లేఖలో తెలిపారు. కమలా హారిస్‌తో తమకు విధానపరమైన విభేదాలు ఉన్నాయని అంగీకరిస్తూనే.. ఆమెకు ప్రత్యామ్నాయంగా, ఆ స్థాయిలో దేశానికి సేవ చేసే నేతలు లేరని స్పష్టం చేస్తున్నారు.