https://oktelugu.com/

America: విమర్శిస్తూనే.. సైనిక, ఆర్థిక సాయం.. అగ్రరాజ్యం తీరు అలా..

ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్‌ గాజాపై దాడులు కొనసాగిస్తోంది. శుక్రవారం(ఏప్రిల్‌ 20న) గాజాపై మెరుపు దాడుల చేసింది. రఫా శివారులో టెల్‌ సుల్తాన్‌లోని నివాస భవనంపై జరిపిన వైమానిక దాడిలో ఆరుగురు చిన్నారులతోపాటు 9 మంది దుర్మరణం చెందారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 21, 2024 / 01:22 PM IST

    America

    Follow us on

    America: ఒకవైపు రష్యా – ఉక్రెయిన్‌ వారు ఏడాదిన్నరగా కొనసాగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య అరు నెలలుగా యుద్ధం జరుగుతోంది. ఇంకోవైపు ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఈ పరిస్థితుల్లో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాము యుద్ధాలకు వ్యతిరేకం అంటూనే యుద్ధం చేసేందుకు తమ అనుకూల దేశాలకు ఆర్థిక, సైనిక సాయం అందిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌కు 90 బిలియన్‌ డాలర్ల ఆర్థియసాయం చేయాలని నిర్ణయించింది. ఈ బిల్లుకు అమెరికా దిగువ సభ ఆమోదం కూడా తెలిపింది.

    గాజాపై దాడుల వద్దంటూనే..
    ఒకవైపు గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను అమెరికా తప్పు పడుతోంది. విమర్శలు చేస్తుంది. మరోవైపు తాజాగా ఇజ్రాయెల్‌కు సైనిక సాయం అందించడానికి అమెరికా ముందుకు వచ్చింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌కు సైనిక సాయం అందించే బిల్లును శనివారం అమెరికా చట్టసభ్యులు ఆమోదం తెలిపారు. సోమవారం ఎగువ సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో రెండు దేశాలకు భారీగా ఆర్థికసాయం అందుతుంది.

    శుక్రవారం మెరుపు దాడి..
    ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్‌ గాజాపై దాడులు కొనసాగిస్తోంది. శుక్రవారం(ఏప్రిల్‌ 20న) గాజాపై మెరుపు దాడుల చేసింది. రఫా శివారులో టెల్‌ సుల్తాన్‌లోని నివాస భవనంపై జరిపిన వైమానిక దాడిలో ఆరుగురు చిన్నారులతోపాటు 9 మంది దుర్మరణం చెందారు. గాజాపై దాడులను తప్పు పడుతున్న అమెరికా.. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులను ప్రోత్సహించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    తగ్గుతున్న ఉద్రిక్తత..
    ఇదిలా ఉండగా ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మద్య నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయి. రెండు రోజులు ఒకరిపై ఒకరు డ్రోన్లతో దాడులు చేసుకున్నారు. పరస్పరం తిప్పి కొట్టారు. అయితే ఇరాన్‌ సంయమనం పాటించడంతో ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది.