https://oktelugu.com/

Heat Waves: ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్

సాధారణంగా ఏప్రిల్ లో వేడి గాలులు మూడు రోజులు పాటే ఉంటాయి. కానీ ఈసారి మరో 10 నుంచి 20 రోజులు పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. తొలి దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో వేసవి తాపం తీవ్రంగా ఉండేది.

Written By:
  • Dharma
  • , Updated On : April 21, 2024 / 01:25 PM IST

    Heat Waves

    Follow us on

    Heat Waves: ఈ ఏడాది వేసవి మండుతోంది. మార్చి మొదటి వారం నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి భానుడు సెగలు కక్కుతున్నాడు. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా ఎండలు ముదురుతున్నాయి. 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా చత్తీస్గడ్, జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్లో తీవ్ర స్థాయి ఉష్ణోగ్రత పరిస్థితులు నెలకొని ఉన్నట్లు భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నీనో బలహీన పడుతున్నప్పటికీ.. ఏప్రిల్, జూన్ మధ్య ఉష్ణోగ్రతలు భారీగా పెరగొచ్చు అని ఐఎండి హెచ్చరిస్తోంది.

    సాధారణంగా ఏప్రిల్ లో వేడి గాలులు మూడు రోజులు పాటే ఉంటాయి. కానీ ఈసారి మరో 10 నుంచి 20 రోజులు పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. తొలి దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో వేసవి తాపం తీవ్రంగా ఉండేది. అయితే మరో 20 రోజులపాటు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. శనివారం ఒడిస్సా లోని బరిపడ, బౌద్ధలో 45.2 డిగ్రీలు, పశ్చిమబెంగాల్లోని మీది నీ పూర్ లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

    ఇక ఏపీ నిప్పుల కొలిమిగా మారుతోంది. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. పలుచోట్ల 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. సాధారణం కంటే మూడు నుంచి 6 డిగ్రీలు అధికంగా ఇవి రికార్డ్ అవుతుండడంతో అనేక మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో భానుడి ప్రతాపం ఉంటుందని.. అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖ వాతావరణం కేంద్రం స్పష్టం చేసింది. కోస్తా తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత నమోదు అవుతుందని.. వడగాల్పుల తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.