https://oktelugu.com/

Amazon River: అతిపెద్ద నది అయిన అమెజాన్ తన దిశను మార్చుకుందా? ఇందులో నిజమెంత?

ప్రపంచంలోనే అతిపెద్ద నది అయిన అమెజాన్ గురించి అందరికీ తెలిసిందే. దక్షిణ అమెరికాలో ఈ అమెజాన్ నది ఉంది. అయితే ఈ నది వ్యతిరేక దిశలో ప్రవహిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

Written By: Kusuma Aggunna, Updated On : November 10, 2024 9:44 pm
Follow us on

Amazon River: ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద నదులు ఉన్నాయి. వీటి గురించి చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుతూనే ఉంటారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద నది అయిన అమెజాన్ గురించి అందరికీ తెలిసిందే. దక్షిణ అమెరికాలో ఈ అమెజాన్ నది ఉంది. నీటి పరిమాణంలో ఈ నది మొదటి స్థానంలో ఉండగా.. పొడవు విషయంలో రెండో స్థానంలో ఉంది. అయితే ఈ అమెజాన్ నది సగటున ఏడాదికి 215000 నుంచి 230000 మీ స్క్వేర్ నీటిని విడుదల చేస్తుంది.

 

పెరూలోని కార్డిల్లెరా రూమి క్రూజ్‌లోని మాంటారో నదిని అమెజాన్ ప్రధాన జలాలుగా గుర్తించారు. మిగతా నదులతో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ నది 20 శాతం నీటిని విడుదల చేస్తుంది. దీని బేసిన్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఉంది. అయితే మిగతా నదులతో పోలిస్తే అమెజాన్ నది వ్యతిరేక దిశలో ప్రవహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అమెజాన్ నది తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తుందట. ఇలా ప్రవహించిన తర్వాత చివరికి అండీస్ పర్వతాల దగ్గర పసిఫిక్ మహాసముద్రం దగ్గర దాని ప్రవాహాన్ని అడ్డుకుంటాయట.

 

ఈ అమెజాన్ నదిని రెయిన్ ఫారెస్ట్‌కు నిలయంగా చెప్పకుంటారు. ఇది పెరూలోని అండీస్ పర్వతాల్లో పుట్ట పెరూ, బొలీవియా, వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్, బ్రెజిల్ వంటి దేశాల్లో ప్రవహించి అట్లాంటిక్ మహాసముద్రంలోకి కలుస్తుంది. ఈ అమెజాన్ నది దాదాపుగా 4000 మైళ్లు ఉంటుంది. అంటే 6400 కి.మీ పొడవు ఉంటుంది. అయితే ఈ నదిపై ఎలాంటి వంతెన కూడా ఉండదు. ఈ నదిలో ఎక్కువగా జలపాతాలు, రివర్ డాల్ఫిన్‌లు ఉన్నాయి. మరి ఈ నదిపై వంతెనలు లేకపోతే ఎలా దాటుతున్నారనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ నదిని దాటాలంటే పడవలు, ఫెర్రీలను ఉపయోగించి దాటాలట. ఈ అమెజాన్ నదిలో తప్పిపోతే చాలా కష్టం. ఈ నది మొత్తం చూడటానికి దాదాపుగా 8 నుంచి 14 రోజుల సమయం పడుతుంది.

 

ఈ నది పొడవుగా ఉంటుంది. కానీ వెడల్పు మాత్రం కేవలం 4 కి.మీ నుంచి 5 కి.మీ వరకు ఉంటుంది. ఈ నదిపై ఎవరైనా కూడా ప్రయాణించవచ్చు. 1542లో ఒరెల్లానా తన బృందంతో కలిసి ఈ నదిలో ప్రయాణించారు. అయితే వర్షాకాలంలో ఈ నదిలో ప్రయాణించడం చాలా కష్టం. వర్షాలకు నది పెరుగుతుంది. అయితే ఈ నదిని ప్రజలు వ్యవసాయానికి, నీరు, జల విద్యుత్, ప్లాంట్‌కి ఉపయోగిస్తారు. ఈ అమెజాన్‌ నదిలో కొన్ని ప్రాంతాలు చాలా మురికిగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలు బాగానే ఉంటాయి. చాలా మంది ఈ నదిని చూడటానికి వెళ్తుంటారు. టూరిస్టులను అమెజాన్ నది వెంబడి క్రూయిజ్ ద్వారా వెళ్తుంటారు. కాకపోతే ఈ నదిలో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉంటే చాలా కష్టం.