https://oktelugu.com/

Asthma: ఈ కాలంలో ఆస్తమా నుంచి విముక్తి చెందాలంటే.. పాటించాల్సిన చిట్కాలు ఇవే!

ఆస్తమా సమస్య నుంచి విముక్తి చెందాలంటే తప్పకుండా డైలీ లైఫ్‌లో కొన్ని చిట్కాలు పాటించాలి. మరి అవేంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 10, 2024 / 10:01 PM IST

    Astama

    Follow us on

    Asthama: సాధారణంగా చాలా మందికి ఆస్తమా సమస్య ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో అయితే చెప్పక్కర్లేదు. సీజన్ ప్రారంభం అవుతుందంటే చాలు.. దగ్గు, జలుబు, ఆస్తమా ఇలా అన్ని సమస్యలు కూడా వస్తాయి. మిగతా సీజన్‌లతో పోలిస్తే చలికాలంలో ఆస్తమాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆస్తమా అనేది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఈ వ్యాధి శ్వాసకోశ మార్గంలో వాపు ఉంటుంది. దీంతో చలికాలం వచ్చిందంటే చాలు పెద్దవాళ్లకే కాకుండా.. చిన్న పిల్లలు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. చలి కాలంలో ఆస్తమా వస్తే.. ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు అన్ని కనిపిస్తాయి. ఆస్తమాకి చికిత్స తీసుకోకపోతే సమస్య ఎక్కువ అవుతుంది. చలికాలం అంతా చల్లని పదార్థాలు తాగలేక, ఆస్తమాతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి విముక్తి చెందాలంటే తప్పకుండా డైలీ లైఫ్‌లో కొన్ని చిట్కాలు పాటించాలి. మరి అవేంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    తులసి
    ఔషధ గుణాలు ఉండే తులసి ఆకులతో ఆస్తమాను తగ్గించుకోవచ్చు. హిందువులు తులసి మొక్కను చాలా పవిత్రంగా పూజిస్తారు. అయితే ఈ తులసి ఆకుల్లో దగ్గును తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శ్వాసనాళంలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. అలాగే శ్వాసకోశ వాపును కూడా తగ్గిస్తుంది. రోజూ ఒక 5-10 తులసి ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఇలా తయారు చేసిన గోరువెచ్చని నీటిలో కాస్త తేనె కలుపుకుని తాగితే.. ఆస్తమా తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే సమస్య తీవ్రంగా ఉంటే రోజుకు ఒకటి నుంచి రెండుసార్లు తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. డైలీ ఇలా తాగడం వల్ల గొంతులో ఉన్న కఫం అంతా పోతుంది. అయితే ఈ తులసి నీరు తాగలేని వారు ఆకులను డైలీ నమిలిన కూడా మంచి ఫలితం ఉంటుంది.

    లైకోరైస్
    ఈ లైకోరైస్‌ను ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు. ఇది గొంతులో ఉండే కఫాన్ని తగ్గిస్తుంది. ఆస్తమా రోగులకు ఈ లైకోరైస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దగ్గు నుంచి తొందరగా ఉపశమనాన్ని ఇచ్చి గొంతులో ఉండే మంటలను తగ్గిస్తుంది. తేనే లేదా గోరువెచ్చని నీటిలో ఈ పౌడర్ కలిపి తాగడం వల్ల ఊపిరితిత్తుల సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. లైకోరైస్‌తో టీ చేసి కూడా తాగవచ్చు. సాధారణంగా టీ చేసుకుని అందులో ఈ లైకోరైస్‌ను కలిపి కూడా తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అయితే దీన్ని రోజుకి రెండు సార్లు తాగడం వల్ల ఆస్తమా సమస్య నుంచి తొందరగా విముక్తి చెందుతారు.

    అల్లం
    సాధారణంగా ప్రతి ఇంట్లో అల్లం వాడతారు. కొందరు దీనిని టీలో ఉపయోగిస్తే మరికొందరు వంటలల రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. అల్లంలో పోషక గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆస్తమాను ఈజీగా తగ్గిస్తాయి. రోజూ తాగే టీలో లేదా డైరెక్ట్‌గా అల్లం ముక్కను తినడం వల్ల ఆస్తమా సమస్య తొందరగా తగ్గుతుంది. అలాగే నీటిలో కాస్త తేనె, నిమ్మరసం, అల్లం కలిపి తాగడం వల్ల కూడా సమస్య నుంచి బయటపడతారు. ఈ వాటర్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఊపిరితిత్తుల సమస్యలు తగ్గడంతో పాటు దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి చెందుతారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.