Hyd Life: హైదరాబాద్ లో చిరు ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి కొన్ని ఆన్ లైన్ సంస్థలు. ఇందులో ఓలా, ర్యాపిడో, ఉబెర్, జెప్టో, జోమాటో, స్విగ్గీలాంటి సంస్థలెన్నో ఉన్నాయి. అదనపు ఆదాయం పొందేందుకు చాలా మంది వీటిని ఎంచుకుంటున్నారు. పార్ట్ టైం జాబ్ లు చేస్తూ తమ ఆర్థిక అవసరాలకు ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. చిన్న స్థాయి కూలీ నుంచి మొదలు కొని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వరకు చాలా మంది వీటి ద్వారా అదనంగా సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ర్యాపిడో, ఓలా లాంటి సంస్థలు ఇలాంటివారికి ఎంతో ఉపయోగకరంగా మారాయి. యువతులు కూడా ఈ ఫ్లాట్ ఫాంలను వినియోగించుకుంటున్నారు. దీంతో పాటు ఫుడ్ డెలివరీ బాయ్స్ గా కూడా చాలా మంది చేరుతున్నారు. అయితే పార్ట్ టైం జాబ్ లకు వేదికలుగా ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయని పలువురు యువకులు చెబుతున్నారు. ఇంటి కోసం ఎంతో కొంత సంపాదన అవసరం ఉంటుందని, చిన్న చిన్న ఖర్చుల నుంచి బయటపడేందుకు ఇవి తమకు ఉపయోగపడుతాయని హైదరాబాద్ కు చెందిన ఓలాడ్రైవర్ సంతోష్ చెబుతున్నారు. తన బైక్ తో రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు ఇలా పార్ట్ టైం రైడింగ్ చేస్తుంటానని , చిన్నచిన్న అవసరాలకు ఈ సంపాదన తనకు అవసరమని తెలిపాడు. హైదరాబాద్ లో ఖర్చుల భారం, కుటుంబ పోషణకు ఇలాంటి అదనపు భారం తప్పదని మరో ర్యాపిడో రైడర్ నరేశ్ చెప్పుకొచ్చాడు. ఉదయం పూట ట్రాఫిక్ సమస్య ఉండదని, అందుకే ఆ సమయంలోనే తాను రైడింగ్ చేస్తున్నట్లు తెలిపాడు. అవసరమైతే ఒక్కోసారి రాత్రిపూట కూడా రైడింగ్ వెళ్తున్నట్లు తెలిపాడు.
సిటీ బిజీ లైఫ్, ట్రాఫిక్ జర్నీ నేపథ్యంలో చాలా మంది ర్యాపిడో, ఓలా, ఉబెర్ లాంటి వేదికలను ఆశ్రయిస్తున్నారు. బైక్ లతో పాటు ఆటోలు, కార్లు ఇలా ఈ ఫ్లాట్ ఫాం ల ద్వారా బుక్ చేసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా తాము వెళ్లాల్సిన గమ్యానికి చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ర్యాపిడో కెప్టెన్లుగా, ఓలా డ్రైవర్లుగా చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అదనపు ఆదాయమే లక్ష్యంగా వీరంతా తమ బైక్ లతో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు.
పార్ట్ టైం చేసే వారికి రోజుకు రూ. 300 నుంచి రూ. 600 వరకు సంపాదన వీటి ద్వారా లభిస్తుంది. ఇందులో ముఖ్యంగా రైడర్ ముందుగా పికప్ పాయింట్ కు చేరుకొని అక్కడి నుంచి రైడ్ బుక్ చేసుకున్న వారిని గమ్యానికి సురక్షితంగా చేర్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఇబ్బందులు తప్పవు. రైడ్ బుక్ చేసుకున్న వారిపట్ల మర్యాదతో మెలగకపోతే మరింత సమస్యగా మారుతుంది.
ఫ్లాట్ ఫాం కమీషన్ పేరిట కొన్ని సంస్థలు అత్యథికంగా వసూలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. పెట్రోల్ ఖర్చులు, కమీషన్ పోను తమకు మిగిలేది కొంతే అయినా, అదనపు సంపాదన కావాలంటే చేయక తప్పడం లేదని పలువురు రైడర్లు చెబుతున్నారు. తమకు తీరిక సమయాల్లో వీటిలో పనిచేయడం ద్వారా ఇబ్బందుల నుంచి తప్పించుకోవచచ్చని అంతా భావిస్తున్నారు.
పట్నంలో మంచి మంచి ఉద్యోగాలు చేసేవారు కూడా వీటిని వినియోగించుకుంటున్నారు. తద్వారా తమ చిల్లర ఖర్చులకు ఎంతో ఉపయోగపడుతాయని చెబుతున్నారు. మంచి బ్యాటరీఫోన్, లోకేషన్ మ్యాప్, డ్రైవింగ్ తెలిసుంటే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సంపాదించుకోవచ్చునని చెబుతున్నారు.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Hyd life how to earn extra income in hyderabad
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com