Shehbaz Sharif And Putin: ఏ ముహూర్తాన పాకిస్తాన్ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడో గానీ షాబాజ్ షరీఫ్.. అంతర్జాతీయ వేదికల మీద పరువు తీసుకుంటున్నాడు.. అంతంతమాత్రంగా ఉన్న పాకిస్తాన్ పరువును కూడా తీస్తున్నాడు.. వాస్తవానికి పాకిస్తాన్ దేశాన్ని చాలా వరకు ప్రపంచ దేశాలు పెద్దగా పట్టించుకోవు. అందులో రష్యా కూడా ఉంటుంది. అయితే ఈసారి రష్యా అధినేత పాకిస్తాన్ ప్రధానమంత్రికి చుక్కలు చూపించారు. అంతర్జాతీయ వేదిక మీద పరువు తీశారు. దీంతో పాకిస్తాన్ ప్రధాని గోర్లు కొరికారు.
సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్న వీడియోలో పాకిస్తాన్ ప్రధాని తీవ్రమైన అసహనంతో కనిపిస్తున్నారు. అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనడానికి ఆయన తుర్క్మెనిస్తాన్ రాజధాని అష్గా బాత్ కు చేరుకున్నారు. అక్కడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వచ్చారు. పుతిన్ ను పాకిస్తాన్ ప్రధానమంత్రి కలవాలనుకున్నారు. కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రిని కలవడానికి రష్యా అధ్యక్షుడు అంతగా ఇష్టాన్ని ప్రదర్శించలేదు.. పైగా తనని కలవడానికి ఏకంగా పాకిస్తాన్ ప్రధాని 40 నిమిషాల పాటు వేచి ఉండేలా చేశారు.. 40 నిమిషాల పాటు ఎదురుచూసిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని తట్టుకోలేక.. పుతిన్, టర్కీస్ అధ్యక్షుడు ఎర్డో గాన్ సమావేశంలో ఉండగా.. ఆ గదిలోకి బలవంతంగా వెళ్లారు. గేట్ క్రాసింగ్ చేస్తూ లోపలికి వెళ్లిపోయారు. ఇంగ్లీష్ లో గేట్ క్రాసింగ్ అంటే.. అనుమతి లేకుండా కార్యక్రమం లేదా వేదికలోకి ప్రవేశించడం.. దీనిని అత్యంత అనుచితమైన ప్రవర్తనగా పేర్కొంటారు.
ఈ అంతర్జాతీయ సమావేశానికి పుతిన్ వెనుక పాకిస్తాన్ ప్రధానమంత్రి ఉన్నారు. అయితే పాకిస్తాన్ ప్రధానమంత్రిని రష్యా అధ్యక్షుడు అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి పదేపదే ముందుకు రావడంతో రష్యా అధ్యక్షుడికి తప్పలేదు. పుతిన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి మధ్య ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని ముందుగా ప్రణాళిక రూపొందించారు. అయితే పుతిన్ ఆ సమయంలో ఎర్డో గాన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి 45 నిమిషాల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది.. అయితే పాకిస్తాన్ ప్రధానమంత్రిని రష్యా అధ్యక్షుడు పట్టించుకోకపోవడం ఇదే తొలిసారి కాదు.. ఆగస్టు నెలలో ప్రధానమంత్రి మోడీ సమక్షంలో కూడా పుతిన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి ని పట్టించుకోలేదు.. ఇప్పుడు తాజాగా మరోసారి పుతిన్ పాకిస్తాన్ ప్రధానమంత్రిని విస్మరించారు.. దీంతో అంతర్జాతీయంగా మరోసారి పాకిస్తాన్ పరువు, ఆ దేశ ప్రధానమంత్రి పరువు పోయింది.
WATCH: Diplomatic incident: The Prime Minister of Pakistan got tired of wasting time, so after waiting 40 minutes for President Putin, he burst in during Putin’s meeting with President Erdogan. pic.twitter.com/8fwhpHE1gE
— Raylan Givens (@JewishWarrior13) December 12, 2025